చంద్రుని (Moon)పై పరిశోధనలు చేయడం కోసం రష్యా (Russia), ఇండియా (India) పోటీపడి మరీ ప్రయోగాలు చేపడుతున్నాయి. ఈ ప్రయోగాల్లో భాగంగా రష్యా లూనా-25 (Luna-25) అనే ల్యాండర్‌ను లాంచ్ చేసింది. అయితే ఈ ప్రయోగం ఆఖరి నిమిషంలో విఫలం అయ్యింది. చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ కుప్పకూలినట్లు రష్యా వెల్లడించింది. తమ ప్రయోగం విఫలం అయ్యిందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ (Roscosmos) ఆదివారం అధికారికంగా ప్రకటించింది.
విజయం సాధిస్తుందనుకున్న లూనా –25 (Luna-25)లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లుగా రష్యా తెలిపింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆ అంతరిక్ష నౌక కుప్పకూలినట్లు వెల్లడించింది. చంద్రునిపైకి దిగే సమయంలో ల్యాండర్ క్రాష్ అయినట్లుగా రోస్కాస్మోస్ తెలిపింది. దాదాపుగా 47 ఏళ్ల తర్వాత రష్యా (Russia) జాబిల్లిపై పరిశోధనలు చేయడం కోసం లూనా-25ను ప్రయోగించింది.
ఇండియా (India) చంద్రయాన్-3 (Chandrayan-3)ని ప్రయోగించిన కొన్ని రోజుల తర్వాత లూనా-25 (Luna-25)ను రష్యా ప్రయోగించడం విశేషం. చంద్రుడి దక్షిణ ధృవంపైన చంద్రయాన్-3 కంటే ముందుగానే దిగేలా రష్యా ఆ ప్రాజెక్టును చేపట్టింది. అయితే రష్యా అనుకున్నవిధంగా జరగలేదు. చంద్రునిపై తమ ల్యాండర్ కుప్పకూలినట్లుగా రష్యా (Russia) వెల్లడించింది.