»He Used It As A Stepping Stone For 80 Years Without Knowing That It Was A Meteor
Meteorite: ఉల్క అని తెలియక 80 ఏళ్లు మెట్టులా వాడాడు..దాని విలువ రూ.70 లక్షలని తెలిసి షాక్
ఓ రైతు తన పొలంలో దొరికిన రాయిని ఇంటి వద్ద మెట్టుగా పెట్టుకున్నాడు. 80 ఏళ్ల తర్వాత అది రాయి కాదని, ఓ ఉల్క అని పరిశోధకులు గుర్తించారు. ఆ రైతుకు రూ.70 లక్షలిచ్చి ఆ ఉల్కను కొనుగోలు చేశారు.
విలువైన రాయి (Stone) అని తెలియక ఓ రైతు దానిని తలుపు వద్ద మెట్టు (Steps)గా పెట్టాడు. 80 ఏళ్ల పాటు ఆ రాయి వారికి మెట్టులాగే ఉండిపోయింది. ఎన్నో ఏళ్ల తర్వాత దానిని మరొకరు చూడగా అది రాయి కాదని తెలిసింది. ఎంతో విలువైన వస్తువని గుర్తించడంతో ఆ రైతును ధనలక్ష్మి వరించింది. ఈ ఆశ్చర్యకర సంఘటన అమెరికా(America)లోని మిచిగన్‌లో చోటుచేసుకుంది. పొలంలో తనకు కనిపించిన రాయిని ఆ రైతు ఇంటి ముందు మెట్టుగా పెట్టాడు. అయితే అది శాస్త్ర పరిశోధన పరంగా ఉల్క (Meteorite). 10 కేజీల బరువుండే ఆ ఖనిజం విలువ రూ.70 లక్షలు ఉంటుంది.
2018లో సెంట్రల్ మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన మోనా సిర్బెస్కు అనే జియాలజిస్టు తన పరిశోధనలో భాగంగా ఓ రైతు ఇంటికి వెళ్లారు. అక్కడే రైతు ఇంటి వద్ద ఉన్న ఉల్క(Meteorite)ను చూశారు. అది విలువైనదని, అరుదైనదని గుర్తిచంారు. ఆ రాయికి ఎడ్మోర్ మెటరాయిట్ అనే పేరును ఖరారు చేశారు. రైతు డేవిడ్ మజూర్క్ తాను 1988లో ఓ పొలం కొనగా అందులో ఆ రాయిని గుర్తించినట్లు తెలిపారు. 1930లో ఆకాశంలో నుంచి ఏదో తమ పొలంలో పడిందని, అది పొలంలోని తమ భవనంపై పడటంతో తమకు తీవ్ర నష్టం కలిగినట్లు తెలిపాడు.
అక్కడ దొరికిన రాయిని తమ పొలంలోనే ఉంచామని రైతు డేవిడ్ మజూర్క్ తెలిపారు. మిచిగాన్ యూనివర్సిటీ (University of Michigan) ఆ రైతుకు సుమారు రూ.70 లక్షలు చెల్లించిన తర్వాత ఆ ఉల్కను స్వాధీనం చేసుకుంది. ఆ ఉల్కను యూనివర్సిటీకి చెందిన అబ్రామ్స్ ప్లానిటోరియంలో శాశ్వతంగా ప్రదర్శనకు ఉంచినట్లు పరిశోధకులు (Scientists) తెలిపారు.