»Rumors Of Pawan New Project With Lokesh Kanagaraj
Pawan kalyan: మాస్ డైరెక్టర్‌తో పవన్ కొత్త ప్రాజెక్ట్.. ఇదే క్లారిటీ!
ప్రస్తుతం పవన్ కళ్యాణ్(pawan kalyan) బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా జెట్ స్పీడ్‌లో ఈ సినిమాల షూటింగ్ చేస్తున్నాడు పవర్ స్టార్. ఈ సినిమాలు కంప్లీట్ అవగానే పూర్తి స్థాయిలో పొలిటికల్‌గా బిజీ కానున్నారు పవర్ స్టార్. కానీ ఇప్పుడు పవన్ కొత్త ప్రాజెక్ట్ గురించి ఓ రూమర్ వైరల్‌గా మారింది. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది.
పవన్ కళ్యాణ్(pawan kalyan), సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ‘బ్రో’ సినిమా షూటింగ్‌ను ఎప్పుడో కంప్లీట్ చేసేశారు పవన్. సముద్రఖని దర్శకత్వంలో.. వినోదయ సీతమ్ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను జూలై 28న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత ఉస్తాద్ లేదా ఓజి సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ రెండు సినిమాల షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు పవర్ స్టార్. హరీష్ శంకర్ ‘ఉస్తాద్’, సుజీత్ ‘ఓజి’ పోటాపోటీగా షూటింగ్స్ జరుపుకుంటున్నాయి.
ఇక ఎప్పుడో మొదలైన క్రిష్ ‘హరిహర వీరమల్లు’ని కూడా ఈ మధ్యలోనే కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇదిలా ఉండగానే.. మరో కొత్త ప్రాజెక్ట్‌కు పవన్ ఓకే చేశారనే న్యూస్ వైరల్‌గా మారింది. అది కూడా ఊహించిన డైరెక్టర్‌తో పవన్ సినిమా అనగానే.. రూమర్స్ క్షణాల్లో స్ప్రెడ్ అయిపోయాయి. గతేడాది కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj).
ప్రస్తుతం విజయ్‌తో ‘లియో(leo)’ అనే సినిమా చేస్తున్నాడు. ఈయనతోనే పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ సినిమాను సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తారనే టాక్ కూడా నడుస్తోంది. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదనే క్లారిటీ వచ్చేసింది. జస్ట్ ఇవన్నీ రూమర్స్ మాత్రమే అని అంటున్నారు. ఇప్పటికే పవన్(pawan) కమిట్ అయిన సినిమాలు చాలా రోజుల తర్వాత సెట్స్ పైకి వచ్చాయి. అలాంటప్పుడు అస్సలు లోకేష్ కనగరాజ్‌తో పవన్ ఉండే ఛాన్సే లేదని చెప్పాలి.