»Salman Khan Security Pushes Vicky Kaushal Out Of The Way At Iifa Press Conference
Vicky Kaushal: స్టార్ హీరోని పక్కకు తోసేసిన సల్మాన్ బాడీ గార్డ్స్!
బాలీవుడ్ స్టార్ హీరోల్లో విక్కీ కౌశల్ కూడా ఒకరు. ఇటీవల స్టార్ హీరోయిన్ తో ఆయన వివాహం కూడా జరిగింది. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా, విక్కీ కౌశల్ కి ఘోర అవమానం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
IIFA 2023 కోసం సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్ అబుదాబీ వెళ్లారు. ఈ ఈవెంట్ లోనే విక్కీ కి ఘోర అవమానం జరిగింది. విక్కీ(Vicky Kaushal)ని.. సల్మాన్ ఖాన్(Salman Khan) బాడీగార్డ్స్ పక్కకు తోసేశారు. ఈ ఈవెంట్ లో విక్కీ ఓ అభిమానితో సెల్ఫీ దిగుతుండగా సల్మాన్ అక్కడికి వచ్చాడు. అతడు రాకముందే ఓ వ్యక్తి విక్కీని పక్కకు తీసుకెళ్లాడు. ఇక సల్మాన్ ను చూడగానే అతనికి దగ్గరికి వెళ్లడానికి విక్కీ కౌశల్ ప్రయత్నించాడు. దీంతో అతని వెనుకే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది విక్కీని వెనక్కి తోసేశాడు. అయినా అతడు మాత్రం సల్మాన్ ను విష్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియో చూసిన అభిమానులు సల్మాన్ తోపాటు అతని సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు అలా చేసినా, విక్కీ మాత్రం చాలా హుందాగా ప్రవర్తించడం గమనార్హం.
తన మాజీ ప్రియురాలిని విక్కీ పెళ్లి చేసుకోవడం సల్మాన్ కి ఇష్టం లేదని, అందుకే ఇలా ప్రవర్తించాడు అంటూ కొందరు కామెంట్స్(comments) చేస్తుండటం విశేషం. కత్రినాను బాలీవుడ్ కు పరిచయం చేసిన సల్మాన్.. అంతకుముందు ఆమెతో కొన్నేళ్ల పాటు డేటింగ్ లో ఉన్నాడు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు చాలాసార్లు వచ్చాయి. పార్ట్నర్, మైనే ప్యార్ క్యూ కియా, ఏక్ థా టైగర్,టైగర్ జిందా హైలాంటి సినిమాల్లో సల్మాన్, కత్రినా కలిసి నటించారు.