»Rbi Update On Rs 2000 Notes 72 Deposits Return India All Banks
RBI update: రూ.2,000 నోట్ల విషయంలో RBI అప్ డేట్
తాము తీసుకున్న నిర్ణయం ఫలితం ఇంత స్పీడ్ గా వస్తుందన్న ఆలోచన ఆర్బీఐ(RBI)కి బహుషా ఉండకపోవచ్చు. ఈ కారణంగానే ఆర్బీఐ సామాన్యులకు 4 నెలలకు పైగా సమయం ఇచ్చింది. అవును. కానీ రూ.2000 నోట్లకు సంబంధించి వచ్చిన తాజా నివేదిక నిజంగా షాకింగ్ అనే చెప్పవచ్చు. అసలు అందేటో ఇప్పుడు చుద్దాం.
భారతదేశంలోని బ్యాంకుల్లో(banks) నెల రోజుల్లో 2000 రూపాయల నోట్లు 72 శాతం డిపాజిట్ అయినట్లు శుక్రవారం RBI వెల్లడించింది. మే 23 నుంచి జూన్ 23 వరకు దేశంలోని అన్ని బ్యాంకుల్లో 72 శాతం రూ.2,000 నోట్లు జమ చేయబడ్డాయని పేర్కొంది. ప్రభుత్వం, RBI కూడా 2000 రూపాయల నోట్లను వదిలించుకోవడానికి ఇంత స్పీడ్ అవుతుందని ఊహించి ఉండదు. ఎందుకంటే ఇంకా 3 నెలలకు పైగా సమయం ఉండగానే 72 శాతం తిరిగి రావడం గ్రేట్ అనే చెప్పవచ్చు. ఇక మిగిలి ఉన్న 28 శాతం నోట్లు ఇంకా బ్యాంకుల్లో డిపాజిట్ లేదా మార్పిడి జరగాల్సి ఉంది.
అయితే మొదట మే 19, 2023న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2000 నోటును చెలామణి నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. ఆ క్రమంలో రూ.2000 నోటును కలిగి ఉన్న ఎవరైనా మే 23 నుంచి బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చని లేదా మార్చుకోవచ్చని ఆర్బీఐ(RBI) పేర్కొంది. సెప్టెంబర్ 30 వరకు గడువు ఉందని కూడా స్పష్టం చేసింది. అంతేకాదు దేశంలో రూ.3.60 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. ఈ డబ్బు తిరిగి రావడం లేదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది కూడా. 2016 నవంబర్లో రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తర్వాత రూ.2000 నోటును తీసుకొచ్చారు.