ఆర్బీఐ(RBI) మరోసారి రూ.2 వేల నోట్ల(Rs.2000 Notes)పై కీలక ప్రకటన చేసింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్(RBI Governer Shaktikanth Das) పాలసీ సమీక్ష తర్వాత మీడియాతో మాట్లాడుతూ రూ.2 వేల నోట్లకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. రెండు వేల నోట్ల ఉపసంహరణ నిర్ణయం తర్వాత బ్యాంకుల్లోకి రూ.1.8 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు వచ్చాయన్నారు. మే 23 నుంచి బ్యాంకులు ఈ నోట్లను స్వీకరిస్తున్నాయి. కేవలం రెండు వారాల్లోనే రూ.1.8 లక్షల కోట్ల విలువైన నోట్లు అంటే 50 శాతం వరకూ వెనక్కి వచ్చేసినట్లు తెలిపారు.
మార్చి 31వ తేది వరకూ రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు చెలామణిలో ఉన్నాయన్నారు. దాదాపు 85 శాతం వరకూ రూ.2 వేల నోట్లు(Rs.2000 Notes) బ్యాంకుల్లో జమ అవుతున్నట్లు తెలిపారు. అంచనాలకు అనుగుణంగా ఆశించిన స్థాయిలో డిపాజిట్లు(Deposites) వస్తున్నాయన్నారు. ఎవరి వద్దనైనా రూ.2 వేల నోట్లు ఉంటే వెంటనే వాటిని బ్యాంకు(Banks)ల్లో డిపాజిట్ చేయాలని సూచించారు. హడావుడి పడాల్సిన పని లేదని, సెప్టెంబర్ 30వ తేది వరకూ గడువు ఉందని శక్తికాంత్ దాస్(RBI Governer Shaktikanth Das) తెలిపారు.
కీలక పాలసీ రేటు అయిన రెపో రేటును ఆర్బీఐ(RBI) స్థిరంగా కొనసాగించడంతో రెపో రేటు 6.5 శాతం వద్దనే ఉంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో రుణ గ్రహీతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రూ.2 వేల నోట్లపై మరోమారు ఆర్బీఐ కీలక ప్రకటన చేయడంతో ప్రజలు అలర్ట్ అయ్యారు. తమ వద్ద ఉన్న రెండు వేల రూపాయల నోట్ల(Rs.2000 Notes)ను బ్యాంకులకు వెళ్లి మార్చుకుంటున్నారు.