»Rbi Repo Rate 65 No Change Shaktikanta Das Mpc Meeting
RBI రేపో రేటు నో ఛేంజ్..జూన్ 12న గత నెల సీపీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గురువారం రెపో రేటును యథాతథంగా 6.5 శాతం వద్ద ఉంచింది. ఇది ద్రవ్య విధాన కమిటీ (MPC) ఏకగ్రీవ నిర్ణయమని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్(shaktikanta das) తెలిపారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గురువారం గవర్నర్ శక్తికాంత దాస్(shaktikanta das) నేతృత్వంలో మూడు రోజుల ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ముగిసిన తరువాత కీలక రేట్లపై తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఏప్రిల్‌లో జరిగిన మునుపటి MPC సమావేశంలో, RBI తన రేటు పెంపును యాథావిధంగా ఉంచింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగించాలని నిర్ణయించింది. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం సడలింపు సహా మరింత క్షీణతకు దారితీసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ బలంగా, స్థితిస్థాపకంగా ఉందని ఈ సందర్భంగా దాస్(shaktikanta das) అన్నారు. ప్రధాన ద్రవ్యోల్బణం లక్ష్యం నాలుగు శాతం కంటే ఎక్కువగా ఉందన్నారు. మిగిలిన సంవత్సరంలో కూడా అలాగే ఉండవచ్చని అంచనా వేశారు. భారతదేశంలో మార్చి-ఏప్రిల్ 2023లో వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం తగ్గింది. 2022-23లో 6.7% నుంచి తగ్గింది. అయితే తాజా డేటా ప్రకారం ద్రవ్యోల్బణం ఇప్పటికీ లక్ష్యం కంటే ఎక్కువగా ఉంది. 2023-24కి సంబంధించి మా అంచనాల ప్రకారం అలాగే ఉంటుందని పేర్కొన్నారు. 2023-24లో ద్రవ్యోల్బణం 4% కంటే ఎక్కువగానే ఉంటుందని దాస్ వెల్లడించారు.
దేశీయ డిమాండ్ పరిస్థితులు వృద్ధికి మద్దతుగా ఉన్నాయని ఆర్బీఐ(RBI) గవర్నర్ తెలిపారు. పునరుద్ధరణ బాటలో పట్టణ డిమాండ్‌ను నిలకడగా, గ్రామీణ డిమాండ్ కూడా ఉందని ఆయన అన్నారు. వినియోగదారుల ద్రవ్యోల్బణం తగ్గినందున సెంట్రల్ బ్యాంక్ కీలక రుణ రేటును యథాతథంగా ఉంచుతుందని వెల్లడించారు. మే 2022, ఈ సంవత్సరం ఫిబ్రవరి మధ్య, పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో రెపో రేటును 4.0 శాతం నుంచి 6.50 శాతానికి RBI 250 బేసిస్ పాయింట్లు (2.50 శాతం) పెంచింది. ఏప్రిల్‌లో 18 నెలల కనిష్ట స్థాయి 4.7 శాతానికి వినియోగదారుల ధరల ఆధారిత (CPI) ద్రవ్యోల్బణం తగ్గిన నేపథ్యంలో MPC సమావేశం జరిగింది. మే నెలలో సీపీఐ ఏప్రిల్ గణాంకాల కంటే తక్కువగా ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. గత నెల సీపీఐ జూన్ 12న వెల్లడికానుంది.