»Rashmika Mandanna Clarity On The Purchase Of Five Houses
Rashmika Mandanna: 5 ఇళ్ల కొనుగోలుపై క్లారిటీ
నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) గత ఐదేళ్లలో ఐదు ప్రాంతాల్లో గృహాల(houses)ను కొనుగోలు చేసిన వార్తలపై స్పందించారు. అవన్నీ పుకార్లేనని స్పష్టం చేశారు. కానీ అదే వార్త నిజమైతే బాగుండని అభిప్రాయం వ్యక్తం చేశారు.
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) విజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమా ప్రాజెక్టులు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో రష్మిక గత ఐదేళ్లలో ఐదు ప్రాంతాల్లో గృహాల(houses)ను కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ ఇళ్లు కూర్గ్, ముంబయి, హైదరాబాద్, బెంగళూరు, గోవా నగరాల్లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై నటి రష్మిక తాజాగా స్పందించారు. ఐదు ఇళ్లు తాను కొనుగోలు చేయడమేనేది అవాస్తమని స్పష్టం చేసింది. ఇలాంటి పుకార్లు ఎవరు సృష్టిస్తున్నారు? ఎందుకు క్రియేట్ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అయితే ఇదే వార్త నిజమైతే బాగుండని అందాల ముద్దుగుమ్మ రష్మిక అంటోంది.
ప్రస్తుతం రష్మిక పుష్ప మూవీ విజయం తర్వాత పుష్ప-2(pushpa 2)లో కూడా నటిస్తోంది. మరోవైపు రణ్ బీర్ కపూర్ హీరో, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శవత్వం వహిస్తున్న యానిమల్ చిత్రంలో కూడా రష్మిక యాక్ట్ చేసేందుకు సైన్ చేసింది. ఇప్పటికే ఇటీవల దళపతి విజయ్ సరసన వారిసు తమిళ్, తెలుగు మూవీలో నటించింది. అటు సిద్ధార్థ్ మల్హోత్రా నటించి, శంతను బాగ్చి దర్శకత్వం వహించిన మిషన్ మజ్ను వంటి హిందీ చిత్రంలో కూడా యాక్ట్ చేసి అదరగొట్టింది.
ఇక రష్మిక మందన్న ఏప్రిల్ 5, 1996న కర్ణాటక(karnataka)లోని కొడగు జిల్లాలోని విరాజ్‌పేటలో సుమన్, మందన్న దంపతులకు జన్మించింది. ఆమె కొడగులోని కూర్గ్ పబ్లిక్ స్కూల్ నుంచి తన పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత బెంగుళూరులోని M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్‌లో సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్‌లో బ్యాచిలర్ డిగ్రీ పట్టాను పొందింది.
2016లో తొలిసారిగా రష్మిక కిరిక్ పార్టీ(kirik party) సినిమాలో నటించింది. ఇది కన్నడలో ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. దీంతో రష్మిక నటనకు అనేక మంది నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు లభించడంతోపాటు బాగా ఫేమ్ కూడా అయ్యింది. అంతేకాదు ఆమె పాత్రకు ఉత్తమ తొలి నటిగా SIIMA అవార్డును కూడా గెలుచుకుంది.