Ramoji rao అందరికీ స్ఫూర్తి, కావాలనే కేసులు: రఘురామకృష్ణ రాజు
ఏపీ సీఎం జగన్‌పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి విరుచుకుపడ్డారు. ఈ సారి మార్గదర్శి చిట్ ఫండ్స్ విషయంలో రామోజీరావుపై వేధింపులు సరికాదంటున్నారు.
Ramoji rao:ఏపీ సీఎం జగన్‌పై (jagan) వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు (raghu rama krishna raju) మరోసారి విరుచుకుపడ్డారు. ఈ సారి మార్గదర్శి చిట్ ఫండ్స్ విషయంలో రామోజీరావుపై (Ramoji rao) వేధింపులు సరికాదంటున్నారు. రామోజీరావు (Ramoji rao) అతని కుటుంబ సభ్యుల ఆస్తి మాత్రమే కాదని చెప్పారు. ప్రజల ఆస్తి అని పేర్కొన్నారు. ఇటీవల రామోజీరావు గురించి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి (keeravani) చెప్పిన అంశాలను గుర్తుచేశారు. ఒక్కరోజైనా రామోజీరావులా (Ramoji rao) గొప్పగా బతకాలని కీరవాణి పేర్కొన్నారు. మార్గదర్శిలా రామోజీరావు (Ramoji rao) జీవిస్తున్నారని రఘురామ (raghu rama) ప్రశంసించారు.
మార్గదర్శి చిట్ ఫండ్స్‌పై జగన్ సర్కార్ కక్షసాధింపు చర్యలకు దిగుతోందని రఘురామ మండిపడ్డారు. న్యాయం రామోజీ వైపు ఉందని గుర్తుచేశారు. అలాగే మార్గదర్శిని మూసివేస్తామని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐడీ ఐపీఎస్ అధికారి చెప్పడం సరికాదన్నారు. గతంలో పనిచేసిన అధికారి వెంకట్రామి రెడ్డి సీఎం జగన్ చెప్పినట్టు వినలేదని బదిలీ చేశారని ఆరోపించారు. అందుకే కొత్త అధికారితో వేధింపులకు దిగుతున్నారని గుర్తుచేశారు. చివరకు మీడియా సంస్థల అధినేతను కూడా సీఎం జగన్ వదలడం లేదన్నారు. ఇదీ మంచి పద్దతి కాదన్నారు.
మార్గదర్శి (Margadarsi) చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు కేసులో ఇటీవల తెలంగాణ హైకోర్టు ఏపీ సీఐడీకి కీలక ఆదేశాలు జారీచేసింది. మార్గదర్శికి చెందిన 30 మంది మేనేజర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టంచేసింది. రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావును సీబీఐ అధికారులు ఈ నెల 3వ తేదీన విచారించారు. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఏ1గా రామోజీరావు (Ramoji rao) ఉండగా..ఏ2గా శైలజ ఉన్నారు.
మార్గదర్శి (margadarsi) చిట్ ఫండ్స్ నిధుల బదిలీ విషయంలో ఆ సంస్థ మార్చి 21వ తేదీన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తమ సంస్థలో సోదాల గురించి రామోజీరావు తరఫు న్యాయవాది వివరించారు. చిట్ ఫండ్ (chit fund) నిధులను బ్యాంకులో (bank) జమ చేయాలి కానీ.. మ్యుచువల్ ఫండ్స్‌కు మళ్లించడంపై ఏపీ సీఐడీ (ap cid) అధికారులు ప్రశ్నించారట. నిధులు బదిలీ చేస్తే.. దుర్వినియోగం అనలేమని అప్పుడు ధర్మాసనం స్పష్టంచేసింది. ఖాతాదారులను మోసం చేశారని అనలేదని పేర్కొంది.
మార్గదర్శికి (margadarsi) సంబంధించి ఖాతాదారులు ఫిర్యాదు చేయలేదని పేర్కొంది. అలాంటి సమయంలో ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగడంపై హైకోర్టు (high court) గతంలో ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రామోజీరావు, శైలాజా కిరణ్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు (high court) స్పష్టం చేసింది. అయినప్పటికీ ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చి.. విచారించింది. దీంతో మరోసారి హైకోర్టును ఆశ్రయించగా.. ఏపీ సీఐడీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.