»Ramashiava Reddy Clarity On Kotamreddy Phone Tapping Issue
phone tapping: కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్‌లో కొత్త ట్విస్ట్
ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ట్విస్ట్. అది ఫోన్ ట్యాపింగ్ కాదని, కాల్ రికార్డింగ్ మాత్రమేనని బయటకు వచ్చాడు ఎమ్మెల్యే స్నేహితుడు, ప్రముఖ కాంట్రాక్టర్ రామశివారెడ్డి.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో షాకింగ్ ట్విస్ట్. ఆయన స్నేహితుడు రామశివారెడ్డి ఈ అంశంపై స్పష్టతను ఇచ్చాడు. అది ఫోన్ ట్యాపింగ్ కాదని, కాల్ రికార్డింగ్ మాత్రమే అని చెప్పాడు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు తనకు బాధ కలిగించిందన్నాడు. తన ఫోన్లో ఆటోమేటిక్‌గా కాల్ రికార్డ్ అవుతుందని, ఆ రోజు కూడా అలాగే రికార్డ్ అయిందని, ఓ కాంట్రాక్ట్ విషయమై ఈ రికార్డింగ్‌ను తన స్నేహితుల వద్ద యాదృచ్చికంగా వినిపించానని చెప్పాడు. కానీ జగన్ (YS Jagan) ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలు వస్తాయని తాను ఊహించలేదన్నాడు. తనది ఆండ్రాయిడ్ ఫోన్ అని, కాబట్టి ప్రతి కాల్ రికార్డ్ అవుతుందన్నాడు. ఉద్దేశ్యపూర్వకంగా తాము కాల్‌ను రికార్డ్ చేయలేదని చెప్పాడు. ట్యాపింగ్ అంటూ కోటంరెడ్డి (Kotamreddy Sridhar Reddy) హంగామా చేస్తున్నాడని, అందుకే తాను బయటకు రావాల్సి వచ్చిందని చెప్పాడు. తన ఫోన్‌ను విచారణ కోసం ఫోరెన్సిక్‌కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు.
తన పైన ఎవరి ఒత్తిడి లేదని, వాస్తవాలు చెప్పడానికి మాత్రమే మీడియా ముందుకు వచ్చినట్లు చెప్పాడు. అసలు తాను ఎవరో జగన్‌కు తెలియదని, ఏదో ఊహించుకొని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నట్లు తెలిపాడు. తనకు ముప్పై ఏళ్లుగా వైయస్ కుటుంబంతో అనుబంధం ఉందని, వైయస్ కుటుంబంపై విశ్వాసం ఉందని చెప్పాడు. తాను, కోటంరెడ్డి పదిపదిహేనేళ్లు కలిసి టీడీపీ (Telugudesam) ప్రభుత్వంపై ఫైట్ చేశామని చెప్పాడు. 2004లో వైయస్ సీఎం అయ్యాక, ఆ తర్వాత తాను రాజకీయాలు వదిలి, కాంట్రాక్టర్‌గా ఉంటున్నట్లు చెప్పాడు. జగన్ వైసీపీ స్థాపించినప్పుడు కోటంరెడ్డి ఆ పార్టీలో చేరినప్పుడు, ఆ తర్వాత ఆ పార్టీ నుండి పోటీ చేసినప్పుడు సంతోషించానని చెప్పాడు. కోటంరెడ్డి తన స్నేహితుడు కాబట్టి అప్పుడప్పుడు ఫోన్లో సంభాషించేవాళ్లమన్నాడు. ఇందులో భాగంగా డిసెంబర్ మూడు లేదా నాలుగో వారంలో కోటంరెడ్డితో కలెక్టరేట్ ఆఫీస్‌లో ఉన్నప్పుడు స్నేహపూర్వకంగా మాట్లాడినట్లు చెప్పాడు. నెల్లూరు (nellore) జిల్లాకు చెందిన మరో కాంట్రాక్టర్ గురించి తనతో చాలాసేపు మాట్లాడినట్లు చెప్పాడు. ఈ కాల్ రికార్డు వైరల్‌గా మారిందని చెప్పాడు.
తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, దీనిపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని కోటంరెడ్డి చెప్పడం తనకు ఆందోళన కలిగించిందన్నారు. ఇది చాలా చిన్న విషయమని, దీనిని ఆయన పెద్దది చేసారన్నారు. వైయస్ కుటుంబం వ్యక్తి దోషిలా నిలబడటాన్ని తాను చూడలేనన్నారు. తన తల్లి, తండ్రి తర్వాత తాను బాగా ప్రేమించే వ్యక్తి వైయస్ రాజశేఖరరెడ్డి అన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలను వేడెక్కించిందని చెప్పారు. అనుకోకుండా తన ద్వారా జరిగిన ఓ చిన్న విషయం ఇంత పెద్దది అవుతుందని భావించలేదన్నారు. తాను వైయస్ భక్తుడిని మాత్రమేనని, కానీ జగన్‌కు (YS Jagan) తాను ఎవరో తెలియదని చెప్పాడు. తనతో అధిష్టానం చెప్పిస్తుందని చెప్పడంలో వాస్తవం లేదన్నాడు. తన ఫోన్లో ఐదారు నెలల కాల్ డేటా ఉందని చెప్పాడు. కోటంరెడ్డితో మాట్లాడింది రికార్డ్ అయిన మాట వాస్తవం, అది ఇతరులకు వెళ్లింది వాస్తవమని చెప్పాడు. ఆ రికార్డును కూడా తాను డిలీడ్ చేసినట్లు చెప్పాడు. అయితే దీనిని ఇప్పుడు చేయలేదని, జనవరి 4న రికార్డ్ చేశానని చెప్పాడు. తాను ఈ రికార్డింగ్‌ను నెల క్రితం డిలీట్ చేసిన మాట వాస్తవమని చెప్పాడు.