AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటన బాధితులకు మంత్రి కందుల దుర్గేష్ పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. సామర్లకోటలోని కుమ్మరి వీధిలో బాధితుల ఇళ్లకు వెళ్లిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.20 లక్షలు, కేంద్ర ప్రభుత్వం తరపున రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.