»Rajamouli Mahesh Babu Hunting Shuru With A Thousand Crores
Rajamouli-Mahesh babu వేట.. వెయ్యి కోట్లతో షురూ?
మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కోసం యావత్ సినీ ప్రపంచం ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. అందుకే.. ఎలాంటి అప్టేడ్ బయటికొచ్చిన సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. లేటెస్ట్ అప్డేట్.. వెయ్యి కోట్ల నుంచి వేట షురూ అనేలా ఉంది.
Rajamouli-Mahesh babu: ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం సినిమా రిలీజ్ అయిపోతుంది. జనవరి 6న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ వరకు మహేష్ బాబు గుంటూరు కారం ప్రమోషన్స్ చేయనున్నాడు. ఎలా చూసినా ఈ మంత్ ఎండింగ్‌తో మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు గుడ్ బై చెప్పనున్నాడు. ఇక ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో చేతులు కలపనున్నాడు. ఇప్పటికే ఫిజికల్‌గా వర్కౌట్స్ స్టార్ట్ చేశాడు మహేష్. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో.. అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.
హాలీవుడ్ కటౌట్ ఉన్న మహేష్ బాబుతో.. హాలీవుడ్ రేంజ్ అడ్వెంచర్ యాక్షన్ మూవీ చేయబోతున్నాడు జక్కన్న. ఈ ఏడాదిలోనే SSMB29 వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రజెంట్ స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు రాజమౌళి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. చాలా రోజులుగా రాజమౌళి-మహేష్ మూవీ బడ్జెట్ గురించి చర్చ జరుగుతునే ఉంది. ముందుగా 600 నుంచి 800 కోట్ల వరకు ఖర్చు చేసే ఛాన్స్ ఉందన్నారు.
కానీ ఇప్పుడు ఏకంగా వెయ్యి కోట్లతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందనే వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ 500 నుంచి 600 కోట్లు వరకే ఆగిపోయాయి. కానీ.. మొట్ట మొదటిసారి వెయ్యి కోట్ల బడ్జెట్‌తో సినిమా అంటే.. ఇక టాలీవుడ్ రేంజ్ హాలీవుడ్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. అయితే.. అక్కడుంది రాజమౌళి కాబట్టి.. బడ్జెట్ లెక్క వెయ్యి కోట్లతో మొదలైతే.. వసూళ్లు డబుల్ ధమాకా రేంజ్లో ఉంటాయి. మరి ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.