వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు సీఎం జగన్ ఇంటికి వెళ్లనున్నారు. తన కుమారుడి రాజారెడ్డి వివాహా ఆహ్వాన పత్రికను ఇవ్వడానికి వెళ్తున్నారని సమాచారం.
YS Sharmila: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెళ్లనున్నారు. ఈరోజు తన తల్లి విజయమ్మతో కలిసి తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి షర్మిల వెళ్లనున్నారు. ప్రస్తుతం షర్మిల ఇడుపులపాయలో ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లనున్నారు. అక్కడ నుంచి తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకోనున్నారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను సోదరుడికి అందజేయడానికి వెళ్తున్నట్లు సమాచారం.
షర్మిల కుమారుడు రాజారెడ్డికి వివాహం నిశ్చియమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 17వ తేదీన అట్లూరి ప్రియతో రాజారెడ్డి వివాహం జరగబోతుంది. ఈక్రమంలో జనవరి 18వ తేదీన వీరి నిశ్చితార్థ వేడుకను నిర్వహించనున్నారు. సాయంత్రం షర్మిల విజయవాడ నుంచి ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం. ఈ నెల 4వ తారీఖున షర్మిల పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నారు.