Rahul gandhi: మీరు దేశ వ్యతిరేకులు, భారతమాతను చంపేశారు
పార్లమెంటు(parliament)లో మణిపూర్ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రెండో రోజున రాహుల్ గాంధీ(rahul gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు భారతమాతకు రక్షకులు కాదని, భారతమాతను చంపిన హంతకులని వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పార్లమెంటు(parliament)లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(rahul gandhi) ప్రసంగించారు. ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్, నుహ్ హింస, గౌతమ్ అదానీ వంటి సమస్యలపై ప్రస్తావించారు. లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ అనంతరం రాహుల్ గాంధీ బుధవారం తొలి ప్రసంగం చేశారు. నా ప్రసంగం అదానీపై ఉండదు. ఈ రోజు తాను నా మనసు నుంచి మాట్లాడాలనుకుంటున్నానని చెప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా బీమా డబ్బులు వచ్చాయా అని ఓ రైతును అడగ్గా రాలేదని చెప్పారని గుర్తు చేశారు. ఆ సమయంలో రైతు బాధ, వారి ఆకలి తెలిసిందన్నారు. ప్రజల బాధలు తెలిశాయన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలోని పెద్ద పారిశ్రామికవేత్తలు వాటిని కూడా లాక్కున్నారని ఆరోపించారు. తన భార్యతో మాట్లాడుతున్నప్పుడు అతని కళ్ళలో బాధ కనిపించిందన్నారు.
కొద్దిరోజుల క్రితం తాను మణిపూర్‌కు వెళ్లానని రాహుల్ అన్నారు. కానీ ప్రధానికి మణిపూర్(manipur) హిందుస్థాన్ కాదు కాబట్టి ఇప్పటి వరకు వెళ్లలేదని వ్యాఖ్యానించారు. మణిపూర్ రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టారని అన్నారు. మణిపూర్‌లో భారత మాత హత్యకు గురైందని అన్నారు. మణిపూర్ ప్రజలను చంపడం ద్వారా మీరు భారతమాతను చంపారని ఎద్దేవా చేశారు. మీరు దేశద్రోహులు, మీరు దేశభక్తులు కాదని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మీరు హర్యానాలో ఏం చేస్తున్నారని నిలదీశారు. మీరు దేశం మొత్తాన్ని తగలబెట్టే పనిలో ఉన్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ ఇద్దరు వ్యక్తుల మాట మాత్రమే వింటారని రాహుల్ అన్నారు. అయితే భారత సైన్యం కోరుకుంటే మణిపూర్‌లో ఒక్క రోజులో శాంతిని పునరుద్ధరించగలమని ఆయన అన్నారు. కానీ మణిపూర్‌లో శాంతిని ప్రభుత్వం కోరుకోలేదన్నారు. మణిపూర్‌లో బీజేపీ రాజకీయాలు ఇండియాను చంపేశాయని రాహుల్ గాంధీ అన్నారు.