భారత నేవీలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశీయంగా తయారు చేసిన యుద్దనౌక ఐఎన్ఎస్ విక్రాంత్… భారత నేవీలోకి చేరింది. కాగా… ఐఎన్ఎస్ విక్రాంత్ ని ప్రధాని నరేంద్రమోదీ… జాతికి అంకితమిచ్చారు. కొచ్చిలో జరిగిన కార్యక్రమంలో ఆయన జాతికి అంకితమిస్తున్నట్లు మోదీ చెప్పారు.
ఐఎన్ఎస్ విక్రాంత్ ను జాతికి అంకితం చేసిన సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. “అతిపెద్ద యుద్ధనౌకలను తయారు చేయగలిగే దేశాల జాబితాలోకి ఈరోజు ఇండియా కూడా చేసింది. విక్రాంత్ రాకతో విశ్వాసం పెరిగింది. ఆత్మనిర్భర్ భారత్ కు మరింత ఉత్తేజం లభించింది,” అని అన్నారు. ఈ నేపథ్యంలో.. నౌకాదళ సరికొత్త చిహ్నాన్ని సైతం ఆవిష్కరించారు ప్రధాని మోదీ.