ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీ పై జనసేనాని పవన్ కళ్యాణ్ విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర రాజధాని విషయంలో ఎప్పటి నుంచో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంటే… అధికార పార్టీ సైతం మూడురాజధానులకు మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. పవన్ ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు.
జనం వికేంద్రీకరణను కోరుకుంటున్నారని, మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని వైసీపీ ప్రభుత్వం చెబుతుండగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దానికి కౌంటర్‌గా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దేనికి ఈ గర్జనలు అంటూ ట్వీట్ చేశారు. రోడ్లు వేయనందుకా? చెత్త మీద కూడా పన్ను వసూలు చేస్తున్నందుకా? సీపీఎస్ మీద మాట మార్చినందుకా? ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వనందుకా? పోలీసులకు టిఏ, డిఏలు ఇవ్వనందుకా?విశాఖపట్నంలో ఋషికొండను అడ్డగోలుగా ధ్వంసం చేసి మీ కోసం భవనం నిర్మించుకొంటున్నందుకా?
దసపల్లా భూములను మీ సన్నిహితులకు ధారాదత్తం చేసేలా ఆదేశాలు ఇచ్చినందుకా? ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆపలేకపోయినందుకా? మత్స్యకారులకు సొంత తీరంలో వేటకు అవకాశం లేక గోవా, గుజరాత్, చెన్నై వెళ్లిపోతున్నందుకా? మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయాటానికా?. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినదానికి భిన్నంగా చేస్తున్నందుకా? అంటూ వరసగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.