ఏపీలోని బాపట్ల సూర్యలంక బీచులో ఘోర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో స్నానం కోసం వెళ్లిన యువకుల్లో నీట మునిగి ముగ్గురు మృతి చెందగా..మరో నలుగురు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరిని గజ ఇతగాళ్లు రక్షించగా..మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ యువకులందరూ విజయవాడకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ కూడా చూడండి: ‘ఆదిపురుష్’ డైరెక్టర్‌కు ప...
ప్రేమ, పెళ్లి, శృంగారం, అబార్షన్ విషయాలపై తాజాగా సుప్రీం కోర్టు షాకింగ్ తీర్పు ఇచ్చింది. మహిళలు పెళ్లికి ముందు కూడా శృంగారంలో పాల్గొనవచ్చని… అవసరమైతే అబార్షన్ కూడా చేయించుకోవచ్చని కోర్టు పేర్కొనడం గమనార్హం. వైవాహిక అత్యాచారాలపై కూడా సంచలన తీర్పు వెలువరించింది. అవివాహిత స్త్రీలు అబార్షన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. భార్యతో బలవంతపు సెక్స్ రేప్ కిందికే వస్తుందని స్పష్టం చేసింది. అది వైవాహ...
విశాఖ రైల్వే జోన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. విశాఖ రైల్వే జోన్ విషయంలో వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. రైల్వే జోన్ రావటం లేదనే వార్తలు అవాస్తవమని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీ అని గుర్తుచేశారు. అప్పటి ప్రధానమంత్రి కూడా రాజ్యసభలో ఈ అంశాన్ని స్పష్టం చేశారని గుర్తుచేశారు....
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజకీయాలను పక్కన పెట్టి మరీ ఆయన జాతీయ రాజకీయాల కోసం కృషి చేస్తూ ఉన్నారు. అయితే.. తాజాగా ఆయన తన జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం కరారు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు… ఆయన జాతీయ రాజకీయాల్లో బిజీ అయితే… తర్వాత టీఆర్ఎస్ పార్టీ ని ఎవరు చూసుకుంటారు అనే అనుమానం కూడా ఉండేది. ఈ మొత్తం వ్యవహారం పై...
టీడీపీ నేత నారా లోకేష్ రాజకీయాల్లో ఈ మధ్య చాలా యాక్టివ్ అయ్యారనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆయన చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ క్రమంలోనే… ఈ రోజు ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. లోకేష్ ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన ఓ వైసీపీ నేత ఇంటికి వెళ్లారు. మంగళగిరి నియోజకవర్గం వైసీపీ నేత, దుగ్గిరాల మాజీ ఎంపీపీ, మాజీ...
వరుస విషాదకర సంఘటనలు తెలుగు సినీ ఇండస్ట్రీని కలిచి వేస్తోంది. ఇటీవలే ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు కాలం చేసిన విషయం తెలిసిందే. ఇది మరువక ముందే మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు తల్లి ‘ఇందిరా దేవి’ బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె మరణవార్త విన్న సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు దిగ్భ్రాంతి ...
వైఎస్ ఫ్యామిలీని సగ్గారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టార్గెట్ చేశారు. గత కొంతకాలంగా జగ్గారెడ్డి, షర్మిల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డిపై ఇటీవల షర్మిల విమర్శల వర్షం కురిపించారు. టీఆర్ఎస్ కి కోవర్టులా జగ్గారెడ్డి పని చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. కాగా… ఈ మాటలు తనను విపరీతంగా బాధించాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు. షర్మిల ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసి...
టీ20 సిరీస్ లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో పోటీపడుతోంది. ఇప్పటికే ఒక మ్యాచ్ ఆసిస్ గెలవగా… రెండో మ్యాచ్ … భారత్ గెలిచింది. ముచ్చటగా మూడో మ్యాచ్… హైదరాబాద్ లో జరగనుంది. ఈ టికెట్ల కోసం.. ఇటీవల జనాలు కొట్టుకున్నారు. తొక్కిసలాట కూడా జరిగింది. ఆ సంగతి పక్కన పెడితే… రేపు ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురచూస్తున్నారు. ఈ నేపధ్యంలో క్రికెట్ అభిమానులకు మెట్రో సంస్థ బంపర...
ఆస్ట్రేలియా లో టీమిండియా టీ20 వరల్డ్ కప్ కోసం తలపడనుంది. కాగా…. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా నూతన జెర్సీలో దర్శనమివ్వనుంది. తాజాగా… ఈ న్యూ జెర్సీ ని బీసీసీఐ నేడు ఆవిష్కరించడం గమనార్హం. ఈ జెర్సీతో సహా ఆటగాళ్ల కోసం ఎంపీఎల్ స్పోర్ట్ సంస్థ రూపొందించిన కిట్ ను ప్రదర్శించింది. ఈ అధికారిక జెర్సీ విడుదల కార్యక్రమం ముంబయిలో జరిగింది. ఈ కొత్త జెర్సీ లేత నీలం రంగులో ఉంది. కొంతవరకు ఇటీవల ఆసి...
రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాజధాని వికేంద్రీకరణపై ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. రాజధాని విషయంలో చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి, శాసనసభకు లేదంటూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ సర్కారు సుప్రీం కోర్టులో సవాలు చేసింది. చట్టాలు చేయడంలో శాసనసభ అధికారాలను కోర్టులు నిర్ణయించలేవని రాష్ట్ర ...
తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కొత్త సచివాలయానికి పేరును తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…. అంబేడ్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్-3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ నేడ...
హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. అభం, శుభం తెలియని ఓ మైనర్ బాలిక పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కారులో బాలికను అపహరించిన దుండగులు ఓ లాడ్జీ తీసుకుని రెండు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అదే లాడ్జీలో వదిలి వెళ్లారు. బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. మత్తు మందు ఇచ్చి నిందితులు సామూహిత అ...
అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. ఆమెను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.42.79 కోట్ల మేర మోసం చేశారనే అభియోగాలపై అరెస్ట్ చేసింది. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ పేరిట రుణం తీసుకుని ఎగ్గొట్టారని పంజాబ్ నేషనల్ బ్యాంక్ గతంలోనే సీబీఐకి ఫిర్యాదు చేసింది. పలు వివరాలను సీబీఐ ...
బీజేపీ నేత రాజాసింగ్ ని ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారనే కారణంతో ఆయనను అరెస్టు చేశారు. ఈ కారణంతో ఆయనను బీజేపీ నుంచి కూడా బహిష్కరించారు. కాగా.. తాజాగా ఆయనకు శ్రీరామ్ సేన మద్దుతగా నిలవడం గమనార్హం. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న ఆయనపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. దీనికింద కేసు నమోదైతే ఏడాది వరకు బెయిల్ వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు చె...
సికింద్రాబాద్‌లోని ఎలక్ట్రిక్ షోరూంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో బైక్ షోరూం పైనే ఉన్న లాడ్జిపైకి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. లాడ్జిలో దట్టమైన పొగలు అలుముకోవడంతో అందులో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగ వ్యాపించి ఊపిరి ఆడక లాడ్జిలో వసతి పొందుతున్న ఎనిమిది మంది పర్యాటకులు మృతి చెందారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో ఐదుగురు ఆసుపత్రిలో కన్నుమూశారు. మృతుల్లో ఏడ...