»Blind Girl Assassinated Near By Cm Jagan House In Tadepalli
CM Jagan ఇంటి సమీపంలో ఘోరం.. గంజాయి మత్తులో అంధురాలు హత్య
సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) నివాసానికి కూత వేటు దూరంలోనే ఈ సంఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతున్నది. పైగా అతడు గంజాయి మత్తులో ఉండడం గమనార్హం. ఏపీలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సీఎం నివాసం సమీపంలోనే గంజాయి దందా సాగుతోంది.
రాజధాని ప్రాంతం.. ముఖ్యమంత్రి నివాసాని (CM Camp Office) కి కూత వేటు దూరం. అయినా భయం లేదు. అమ్మాయి అంధురాలు అయినా మానవత్వం లేదు. కామం మైకంలో యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. అంధురాలైన (Blind) ఆమె అతడిని బలంగా ఎదుర్కొన్నది. తీవ్రంగా ప్రతిఘటించడంతో అతడు వెళ్లిపోయాడు. దాడి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఆ దుండగుడిని వారు మందలించారు. ఇది కక్ష పెట్టుకున్న ఆ దుర్మార్గుడు తెల్లవారు కాగానే ఆ యువతి (Girl) అతి కర్కషంగా హత్య చేశాడు. అయితే గంజాయి (Marijuana) మత్తులో ఈ దారుణానికి అతడు ఒడిగట్టాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీ (Andhra Pradeshలోని గుంటూరు జిల్లా (Guntur District) తాడేపల్లి (Tadepalli)లోని ఎన్టీఆర్ కట్ట ప్రాంతంలో ఎస్తేరు రాణి (17) కుటుంబసభ్యులతో నివసిస్తోంది. అంధురాలైన (Blind Person) రాణి తల్లిదండ్రులతో పాటే ఉంటోంది. అయితే ఇంటికి సమీపంలోనే నివసిస్తున్న రాజు బాలికపై కన్ను పడింది. ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. తీవ్ర భయాందోళనకు గురైన ఆ అమ్మాయి వెంటనే తల్లిదండ్రుల (Parents)కు చెప్పింది. వారు వచ్చి రాజుని నిలదీశారు. ‘నాకు ఏం తెలియదు. రాణి నాకు చెల్లి లాంటిది’ అని రాజు (Raju) నమ్మ బలికాడు. రాత్రి ఇంటికెళ్లాడు. అయితే తనను నిలదీయడంపై రాజు తీవ్ర కోపం పెంచుకున్నాడు. బాలిక తన పరువు తీసిందని భావించి ఎలాగైనా రాణిని చంపేయాలని రాత్రంతా అనుకున్నాడు. సోమవారం తెల్లవారుజామునే లేచి బాలిక ఇంట్లోకి ఉన్నాడు. అప్పటికే గంజాయి మైకంలో ఉన్న రాజు అంధురాలు అని కూడా చూడకుండా పదునైన ఆయుధంతో రాణి తలపై నరికాడు. తీవ్ర రక్తపు మడుగులో అక్కడికక్కడే రాణి చనిపోయింది. నిందితుడు రాజుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి దారుణాలకు అతడు పాల్పడ్డాడని సమాచారం. ఆకతాయిగా, జులాయిగా తిరుగుతూ స్థానికంగా రౌడీగా ముద్ర పడిపోయాడు. అయితే ఘటన జరిగిన వెంటనే రాజు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తున్నది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకుంటున్నారు.
అయితే సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) నివాసానికి కూత వేటు దూరంలోనే ఈ సంఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతున్నది. పైగా అతడు గంజాయి మత్తులో ఉండడం గమనార్హం. ఏపీలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సీఎం నివాసం సమీపంలోనే గంజాయి దందా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం గంజాయిపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో అమాయకురాలైన అంధురాలు రాణి ప్రాణం బలైందని ప్రతిపక్ష (Oppositon Party) నాయకులు వాపోయారు. గంజాయిపై ఉక్కుపాదం మోపాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కట్టడి చేయాల్సిన అధికారులు గంజాయి వ్యాపారానికి వంత పాడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదీ ఏమైనా రాణి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.