»Ap Cm Ys Jaganmohan Reddy Will Launch Aadudam Andhra Tournament In Guntur District
Aadudam Andhra: ఏపీలో రేపటి నుంచే ‘ఆడుదాం ఆంధ్రా’.. 47 రోజుల క్రీడా సంబరం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు.
Aadudam Andhra: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. రేపు గుంటూరు జిల్లా నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్లో ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నారు. రేపటి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు క్రీడా పోటీలు జరగనున్నాయి. ఏపీలో 47 రోజుల పాటు ఈ క్రీడోత్సవాలు జరగనున్నాయి. గ్రామ వార్డు సచివాలయం, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో పోటీలు జరుగుతాయి. ప్రతిభను గుర్తించడం, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పోటీపడేలా వారిని సన్నద్ధం చేయడం, క్రీడా స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఇప్పటికే పూర్తయ్యాయి. క్రీడల్లో పాల్గొనే వారు కోటీ 22 లక్షల మంది. నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు బహుమతులు ఉంటాయి. అందుకోసం ప్రభుత్వం 12 కోట్లకు పైగా నగదు సమకూర్చింది. సీఎం జగన్ రేపు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరుతారు. పదిన్నర గంటలకు నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్కు సీఎం చేరుకుంటారు. అనంతరం శాప్ జెండాను, జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. అనంతరం సీఎం జగన్ ప్రారంభోపన్యాసం చేస్తారు. క్రీడా జ్యోతిని వెలిగించి లెట్స్ ప్లే ఆంధ్రా టోర్నీని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం జగన్ క్రీడాకారులతో ముచ్చటించనున్నారు. మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.