»Kiran Abbavaram Said Speech Audio Launch Jalsa Movie Time
Kiran Abbavaram: గోడ దూకి చాలా సార్లు సినిమాలు చుశా..కానీ జల్సా సమయంలో
జల్సా సినిమా విడుదలైన సమయంలో టిక్కెట్ల కోసం చాలా ఇబ్బంది పడినట్లు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గుర్తు చేసుకున్నారు. తాను హీరోగా నటించిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం తిరుపతిలో జరిపిన క్రమంలో ఈ మేరకు వెల్లడించారు. మరోవైపు అనేక సినిమాలు స్కూల్ గోడ దూకి చుశానని గుర్తు చేసుకున్నారు.
స్కూల్ గోడ దూకి చాలా సార్లు సినిమాలు చుశానని టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) పేర్కొన్నారు. గ్రూప్ థియేటర్లలో తన అంత సెలబ్రేషన్స్ ఎవరూ చేసి ఉండరని తెలిపాడు. ప్రతి ఒక్క హీరో సినిమాను దాదాపు తిరుపతిలోనే చూశానని గుర్తు చేసుకున్నారు. మరోవైపు తాను ఎప్పుడు సినిమాల్లోకి వెళతానని అనుకోలేదన్నారు. ఇదంతా మీ అభిమానం వల్లనేనని కిరణ్ అన్నారు. తాను యాక్ట్ చేసిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం తిరుపతిలో నిర్వహించిన సందర్భంగా వెల్లడించారు. ఈ క్రమంలో తిరుపతితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 30 రోజులు ఈ సినిమా షూటింగ్ ఇక్కడే జరిగిందని.. ఈ సినిమాలో తిరుపతిని ప్రత్యేకంగా చూపించామని కిరణ్ అబ్బవరం అన్నారు. మరోవైపు గుడి దగ్గర ఫైట్ చూస్తే అభిమానులకు పూనకాలు వస్తాయని కిరణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా విడుదల కానున్న ఫిబ్రవరి 18న(మహా శివరాత్రి)రోజున అభిమానలకు తప్పకుండా నచ్చుతుందని భావించారు.
గతంలో జల్సా సినిమా(jalsa movie) విడుదలైనప్పుడు తాను ఇంటర్ చదివేవాడినని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆ క్రమంలో తిరుపతి(tirupati)లోని అన్ని థియేటర్లలో జల్సా సినిమా రిలీజైనా కూడా తనకు కష్టంగా టిక్కెట్టు దొరడం కష్టంగా మరిందని తెలిపాడు. అప్పుడు జల్సా సినిమాను నిర్మించిన గీతా ఆర్ట్స్ బ్యానర్లో ప్రస్తుతం తాను నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్, బన్నీవాసుకు థాంక్స్ చెప్పాడు.
వినరో భాగ్యము విష్ణు కథ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరు స్టోరీ అందించగా, మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం(Murali Kishor Abburu) వహించారు. చైతన్ భరద్వాజ్(Chaitan Bharadwaj)సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేశారు. ఇక ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం సరసన కాశ్మీర పరదేశీ హీరోయిన్ గా నటించింది. దీంతోపాటు మురళీ శర్మ, శుభలేక సుధాకర్ వంటి తదితర నటినటులు యాక్ట్ చేశారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2(GA2) పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు(Bunny Vas) నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ క్రమంలో మహాశివరాత్రి రోజు రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా అదరిస్తారు? సినిమా హిట్టా ఫట్టా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.