దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న మహిళల టీ20(Womens T20) వరల్డ్ కప్ లో టీమిండియా, పాక్(IND vs PAK) తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్(Team India) ఘన విజయం సాధించింది.
దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న మహిళల టీ20(Womens T20) వరల్డ్ కప్ లో టీమిండియా, పాక్(IND vs PAK) తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్(Team India) ఘన విజయం సాధించింది. మ్యాచ్ లో భాగంగా మొదట టాస్ గెలిచిన పాక్ బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన తర్వాత పాకిస్థాన్ ను భారత బౌలర్లు కట్టడి చేశారు. కేప్ టౌన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 149 రన్స్ చేసింది.
ఆ జట్టు కెప్టెన్ బిస్మా మారూఫ్ 55 బంతుల్లో 68 పరుగులు చేసింది. చివర్లో ఆయేషా నసీమ్ బ్యాటింగ్ దూకుడుగా ఆడటంతో పాక్ 149 పరుగులు చేయగలిగింది. ఆయేషా 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 43 పరుగులు చేసి భారత బౌలర్లను ఎదుర్కొంది. టీమిండియా(Team India) బౌలర్లలో రాధా యాదవ్ 2, దీప్తి శర్మ 1, పూజా వస్త్రాకర్ 1 వికెట్ తీసి పాక్ బ్యాటర్లను కట్టడి చేశారు.
ఆ తర్వాత 150 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత అమ్మాయిలు 7 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 49 పరుగులు చేశారు. ఓపెనర్ యస్తికా భాటియా 17 పరుగులు చేసి సాదియా ఇక్బాల్ బౌలింగ్ లో ఔట్ అయ్యింది. ఆ తర్వాత 3 వికెట్ల నష్టానికి టీమిండియా(Team India) 151 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ 38 బంతుల్లో 53 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది. పాక్ పై భారత్(Team India) గెలుపుతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు.