»Hardik Pandya Re Marriage With Natasha At Rajasthan Jaipur
Hardik Pandya:కు మళ్లీ పెళ్లి..కారణం ఇదేనా?
ఇండియన్ స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మళ్లీ పెళ్లి చేసుకోనున్నట్లు తెలిసింది. ఈ ఏడాది ప్రేమికుల రోజున తన భార్య నటాసా స్టాంకోవిక్ తో గ్రాండ్ గా వివాహం చేసుకోవాలని భావించినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా(hardik pandya) మళ్లీ పెళ్లి(re marriage) చేసుకోబోతున్నారు. అదేంటీ తనకు ఇప్పటికే పెళ్లి జరిగి, ఓ బాబు కూడా ఉన్నాడు కదా. అవును కానీ గతంలో పాండ్యా మే 31, 2020న సన్నిహితుల సమక్షంలో నటాసా స్టాంకోవిక్(Nataša Stanković) తో కోర్టులో వివాహం చేసున్నాడు. ఈ నేపథ్యంలో ఈసారి మాత్రం ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రోజున ఘనంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లైన మూడు సంవత్సరాల వివాహం తర్వాత ఈ జంట రాజస్థాన్ ఉదయపూర్లో ప్రేమికుల రోజున తిరిగి వివాహం(re marriage) చేసుకోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం. అందుకోసం ఫిబ్రవరి 13న ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలు..ఫిబ్రవరి 16 వరకు పలు రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. హల్దీ, మెహందీ, సంగీత్లను కూడా వైభవంగా జరుపుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ వేడుకకు సంబంధించిన సన్నాహాలు నవంబర్ 2022లో ప్రారంభమైనట్లు తెలిసింది. ఇంకోవైపు ఇటీవల సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ కూడా రాజస్థాన్లోని జైసల్మేర్లో వివాహం చేసుకున్నారు. ఇలా పలు సెలబ్రిటీల వివాహాలు రాజస్థాన్(rajasthan) లోనే జరగడం విశేషం.
2013లో ప్రకాష్ ఝా చిత్రం సత్యాగ్రహంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన నటాసా స్టాంకోవిచ్(Nataša Stankovic), తన భర్త, భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాను తిరిగి వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో నటాసా ప్రత్యేకంగా తయారు చేసిన తెల్లటి డోల్స్ & గబ్బానా గౌనును ధరించనుందని తెలిసింది. పెళ్లికి సంబంధించిన ఇతర వివరాలు, హార్దిక్ వేషధారణ గురించి ఇంకా తెలియలేదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీరి పెళ్లి వేడుకను వారి కుమారుడు అగస్త్య కూడా చూసి ఎంజాయ్ చేయనున్నాడు. జనవరి 2020 దుబాయ్(dubai) టూర్లో భాగంగా నటాసాకు హార్దిక్ ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత పాండ్యా ప్రపోజ్ చేసిన వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. ఆ క్రమంలో ఈ జంట వారి నిశ్చితార్థాన్ని అధికారికంగా ఇన్స్టాగ్రామ్(instagram)లో షేర్ చేస్తూ పంచుకున్నారు.