»Fire Accident At Kukatpally Two Vans And One Travel Bus Fire
Fire Accident: కూకట్ పల్లిలో అగ్ని ప్రమాదం..2 వ్యాన్లు, ఓ బస్సు దగ్ధం
హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఐడీఎల్ చెరువు సమీపంలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ నేపథ్యంలో ఓ ట్రావెల్ బస్సుతోపాటు రెండు వ్యాన్లు కాలిపోయాయి.
హైదరాబాద్(Hyderabad) కూకట్ పల్లి(kukatpally)లోని ఐడీఎల్ చెరువు(idl cheruvu) పరిధిలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. ఈ క్రమంలో ఒక ట్రావెల్ బస్సు(travel bus)తోపాటు రెండు వ్యాన్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది(fire officers), పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ఆ వాహానాలు పార్కింగ్ చేసిన క్రమంలో ప్రమాదం జరగడంతో ఎవరికీ ప్రాణనష్టం జరుగలేదు. మరోవైపు ఆ వాహనాలు ఎవరివి, వాటికి ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు.
ఇంకోవైపు హైదరాబాద్లో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాద ఘటనలపై స్థానికులు(local people) భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు అగ్ని ప్రమాదం జరుగుతుందో అర్థం కావడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్(secunderabad) డెక్కన్ స్పోర్ట్ వేల్ షాపింగ్ మాల్లో చోటుచేసుకున్న ప్రమాద ఘటన మరచిపోక ముందే తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇలా ప్రతి సంవత్సరం ఎండాకాలం వచ్చిందంటే చాలు అనేక అగ్ని ప్రమాద ఘటనలు(Fire Accidents) చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి వాటి పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.