»Current Bill Of Rs 11 Crore For Panchayat Office Kothapalli Kamareddy Villagers Fire On Acd Charges
Panchayat office:కు రూ.11 కోట్ల కరెంట్ బిల్..మరోవైపు ఏసీడీ ఛార్జీల దోపిడీ!
తెలంగాణ కామారెడ్డి జిల్లాలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ ఆఫీసుకు రూ.11,41,63,672 కరెంట్ బిల్లు వచ్చింది. ఇది చూసిన అక్కడి గ్రామ సర్పంచ్, సిబ్బంది అంత బిల్లు రావడమెంటని విద్యుత్ అధికారులను ప్రశ్నించారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆ బిల్లు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఏసీడీ ఛార్జీల పేరుతో పెద్ద ఎత్తున విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మీరెప్పుడైనా కోట్ల రూపాయల్లో కరెంట్ బిల్లు(Current bill) రావడం విన్నారా? అదేంటీ అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే. ఇటీవల తెలంగాణ(telangana) కామారెడ్డి(kamareddy) జిల్లాలోని సాధారణ గ్రామపంచాయతీ(Panchayat office) కొత్తపల్లి(kothapalli) ఆఫీసుకు పెద్ద మొత్తంలో 11 కోట్ల రూపాయలకుపైగా విద్యుత్ బిల్లు వచ్చింది. ఈ విషయం తెలిసిన అక్కడి గ్రామపంచాయతీ సిబ్బంది చూసి అవాక్కయ్యారు. ఇంత బిల్లు రావడంమెంటని ఆశ్చర్యపోయారు. మరోవైపు అక్కడి పంచాయతీ నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న తరుణంలో కోట్ల రూపాయల బిల్లు ఎలా వేశారనే దానిపై అక్కడి సర్పంచ్ సహా పలువురు వివరాలను ఆరా తీశారు.
సిబ్బందిపై మండిపాటు
అయితే విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే అంత బిల్లు వచ్చినట్లు తర్వాత తేలింది. ఈ కొత్తపల్లి పంచాయతీ కార్యాలయానికి జనవరి నెలకు గాను విద్యుత్ శాఖ అధికారులు(vidyut officers) రూ.11,41,63,672 కరెంట్ బిల్లును ఇచ్చారు. ఆ క్రమంలో విషయం తెలిసిన గ్రామస్థులు కూడా కోట్లలో కరెంట్ బిల్లు రావడమెంటని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై విద్యుత్ శాఖ సిబ్బందిపై మండిపడ్డారు. అటు పంచాయతీ సర్పంచ్ సహా పలువురు అధికారులను ఈ బిల్లు అంశంపై నిలదీశారు. తర్వాత విద్యుత్ సిబ్బంది(electricity bill officers) నిర్లక్షమే అందుకు కారణమని వివరణ ఇవ్వడంతో అంతా సద్దుమణిగింది.
ఏసీడీ ఛార్జీల పేరుతో
ఇంకోవైపు తెలంగాణలో ఏసీడీ ఛార్జీల(ACD charges) పేరుతో కరెంట్ బిల్లులు పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాణాల్లో కంటే గ్రామాల్లోనే ఎక్కువ కరెంట్ బిల్లులు వస్తున్నాయని చెబుతున్నారు. సాధారణ గ్రామ పంచాయతీలో నివసిస్తున్న ఇళ్లకు నెలకు వెయ్యి నుంచి 4 వేల రూపాయల వరకు విద్యుత్ బిల్లు వస్తుందని మండిపడుతున్నారు. ఇంత కరెంట్ బిల్లు పట్టాణాలు, నగరాల్లో కూడా లేదని బాధిత గ్రామస్తులు విద్యుత్ అధికారులు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కరెంట్ బిల్లు కట్టకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని, ఫైన్ కూడా ఎక్కువగా వసూలు చేస్తున్నారని కరెంట్ బిల్లుల బాధితులు అంటున్నారు. పెంచిన కరెంట్ బిల్లుల వల్ల ప్రతి నెల తమ కుటుంబంపై పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడుతుందని గ్రామస్థులు వాపోతున్నారు.
ఈ పరిశ్రమలకు భారీగా పెంపు
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఫెర్రో అల్లాయిస్ రంగానికి(ferro alloys industry) కరెంట్ బిల్లు యూనిట్ కు మూడు రూపాయలు పెంచిందని ఆయా పరిశ్రమల బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర కంపెనీలకు రూపాయి పెంచిన ప్రభుత్వం తమకు మాత్రం రూ.3 పెంచడమెంటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున కరెంట్ బిల్లులు వచ్చి చెల్లించలేక పలు పరిశ్రమలు మూసేస్తున్నట్లు భాధిత యాజమానులు పేర్కొన్నారు.