»Central Minister Kishan Reddy Sawal To Cm Kcr On Indian Economy Status Discussion 2023
Kishan Reddy: నేను రాజీనామాకు సిద్ధం..చర్చకు సిద్ధమా కేసీఆర్ చెప్పాలి
భారతదేశ ఆర్థిక పరిస్థితి గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ అసత్య ఆరోపణలు చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై తాను చర్చకు సిద్ధమని ఎక్కడకు రావాలో కేసీఆర్ చెప్పాలని సవాల్ విసిరారు. కేసీఆర్ రాజీనామా లెటర్ జేబులో పెట్టుకుని చర్చకు రావాలని పేర్కొన్నారు.
దేశ ఆర్థిక పరిస్థితి గురించి తెలంగాణ(telangana) సీఎం కేసీఆర్(kcr) పచ్చి అబద్ధాలు మాట్లాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(kishan reddy) పేర్కొన్నారు. ఈ అంశంపై రాజీనామా చేస్తానని ప్రకటించిన కేసీఆర్ రాజీనామా లెటర్(resignation letter) జేబులో పెట్టుకుని చర్చకు రావాలని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఎక్కడికి రావాలని చెప్పాలని వెల్లడించారు. నీ ఫాం హౌంస్ కు రావాలా లేదా అమర వీరుల స్తూపం దగ్గరకు రావాలా లేదా అసెంబ్లీ(assembly)కి చర్చకు రావాలో చెప్పాలని నిలదీశారు. కేసీఆర్(kcr)కు దేశ ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన లేకపోతే గూగుల్లో వెతికినా కూడా దొరుకుతుందన్నారు. కానీ ఇష్టం వచ్చినట్లు ఇండియన్ ఎకానమీ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదని కిషన్ రెడ్డి సూచించారు.
అప్పుల రాష్ట్రం
తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేసిన కేసీఆర్ దేశ పరిస్థితి గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా తర్వాత 60 వేల కోట్ల రూపాయల అప్పు(telangana debt) ఉండగా..ప్రస్తుతం 5 లక్షల కోట్ల అప్పులు చేశారని వెల్లడించారు. మరోవైపు ప్రాజెక్టుల(projects) పేరుతో కేసీఆర్ వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రతి ప్రాజెక్టు, ప్రతి నిర్మాణంలో కూడా కేసీఆర్ కమిషన్ తీసుకుంటూ కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు.
తెలంగాణలో సమస్యలు
అసలు తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తెలంగాణలోని సమస్యలు(telangana problems) సహా బడ్జెట్ అంశాల గురించి ప్రస్తావించకుండా..కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం(central governament) మీద బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని కిషన్ రెడ్డి అన్నారు. సీఎంకు ప్రజా సమస్యలపై అసలు పట్టింపే లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం గత బడ్జెట్ నుంచి ఈ బడ్జెట్ వరకు ఏం చేసిందో అసలు చెప్పలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వైఫల్యాలపై చర్చ జరుగలేదు, నిరుద్యోగ భృతి, దళితులకు భూమి అంశం, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల సమస్యలు, గ్రామాల్లో రైతుల ఇబ్బందులు ఇలా అనేక అంశాలపై అసలు ప్రస్తావనే చేయలేదని ఎద్దేవా చేశారు. బడ్జెట్ సమావేశాల(telangana budget session 2023)ను కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టెందుకే ఉపయోగించుకున్నారు తప్ప ప్రజా సమస్యల ప్రస్తావన ఎక్కడ ఉందని కిషన్ రెడ్డి నిలదీశారు.
కాంగ్రెస్ BRSతో పొత్తు!
మరోవైపు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని పొగడడం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీతో పొత్తు పెట్టుకుంటారని అనిపిస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటి నుంచే కేసీఆర్ కాంగ్రెస్(congress) పార్టీ మద్దతు కోసం చేతులు చాస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. అబద్ధాలను అద్భుతంగా చెప్పడంలో కేసీఆర్(kcr) మొదటి స్థానంలో ఉంటారని ఆరోపించారు. కేసీఆర్ తన బాధ్యతలను విస్మరించి, తన పరిధి దాటి వ్యాఖ్యలు చేస్తున్నారని వెల్లడించారు. ఎన్నికలకు ఇంకా ఏడు, ఎనిమిది నెలలు మాత్రమే ఉందని..నీ రాజీనామా పేపర్(resignation letter) తప్పకుండా సమర్పించాల్సి వస్తుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కల్వకుంట్ల కుటుంబం నోరు తెరిస్తే అసత్య ఆరోపణలు, అబద్ధాలు చెప్పడం తప్ప ఏం లేదని కిషన్ రెడ్డి అన్నారు.