»Earthquake In Assam Registered As 4 0 On The Richter Scale
Assam Earthquake: అసోంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదు
అసోంలో భూకంపం(Assam Earthquake) సంభవించింది. రాష్ట్రంలోని నాగావ్ పట్టణంలో ఆదివారం సాయంత్రం ఈ భూకంపం(Earthquake) సంభవించడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. సాయంత్రం 4.18 గంటలకు నాగావ్ పరిధిలో భూమి కంపించింది.
అసోంలో భూకంపం(Assam Earthquake) సంభవించింది. రాష్ట్రంలోని నాగావ్ పట్టణంలో ఆదివారం సాయంత్రం ఈ భూకంపం(Earthquake) సంభవించడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. సాయంత్రం 4.18 గంటలకు నాగావ్ పరిధిలో భూమి కంపించింది. నాగావ్ పరిధిలోని పది కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ వెల్లడించింది. ఈ జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం భూకంప తీవ్రతను తెలిపింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.0గా నమోదైనట్లు ప్రకటించింది.
అసోంలో భూకంప తీవ్రతను జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. అయితే, ఈ భూకంపం(Earthquake) ప్రభావం ఏమేర ఉందనే విషయాలు ఇంకా తెలుపలేదు. ప్రజలపై, నివాసాలపై దీని ప్రభావం పెద్దగా ఉండదని సమాచాం. నిపుణుల వివరాల ప్రకారం 4.0 తీవ్రత అంటే ఇది చాలా చిన్న భూకంపమేనని అధికారులు తెలిపారు. అయితే టర్కీ, సిరియాల్లో నమోదైన భూకంప(Earthquake) తీవ్రతకు దగ్గరగా ఉందని, అక్కడ 7.8 తీవ్రత నమోదైందని అధికారులు వెల్లడించారు.
ఇండియాతోపాటు పలు చోట్ల, ఏదో ఒక సమయంలో భూమి కంపిస్తూనే ఉందని అధికారులు గుర్తించారు. శనివారం గుజరాత్‌లోని సూరత్‌లో కూడా స్వల్ప భూకంపం(Earthquake) సంభవించడంతో ప్రజలు ఆందోళన చెందారు. హజిరా జిల్లాలో అరేబియా సముద్ర తీరంలో 5.2 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం కనిపించినట్లు అధికారులు తెలిపారు. గుజరాత్ లోని సంభవించిన భూకంప(Earthquake) తీవ్రత 3.8గా నమోదైంది. అయితే అక్కడ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.