»Zomato In Heavy Losses Services Suspended In 225 Cities
Zomato closure: తీవ్ర నష్టాల్లో జొమాటో.. 225 నగరాల్లో సేవలు నిలిపివేత
ప్రముఖ ఫుడ్ డెలివరీ(Food delivery App) టెక్ కంపెనీ అయిన జొమాటో(Zomato) షాకింగ్ విషయం చెప్పింది. తమ సంస్థ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నట్లు జొమాటో(Zomato) తెలిపింది. ఈ నష్టాల వల్ల దేశంలోని 225 చిన్న నగరాల్లో తన సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.
ప్రముఖ ఫుడ్ డెలివరీ(Food delivery App) టెక్ కంపెనీ అయిన జొమాటో(Zomato) షాకింగ్ విషయం చెప్పింది. తమ సంస్థ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నట్లు జొమాటో(Zomato) తెలిపింది. ఈ నష్టాల వల్ల దేశంలోని 225 చిన్న నగరాల్లో తన సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. తాము నష్టాలను తగ్గించుకునేందుకే చిన్న నగరాల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.346.6 కోట్ల నష్టాలను చవిచూసినట్లు తెలిపింది. కంపెనీ తన మూడో త్రైమాసిక ఫలితాలను శుక్రవారం రిలీజ్ చేసింది.
After reporting losses of Rs 346.6 crore for the quarter that ended in december, food delivery tech giant Zomato has pulled its operations out of 225 cities, saying that the performance of these cities was 'not very encouraging'. pic.twitter.com/MRjQvgI5am
గత కొన్ని త్రైమాసికాల్లో పలు నగరాల్లో జొమాటో(Zomato) పనితీరు ఆశాజనకంగా లేదని తెలిపింది. అందుకే అలాంటి 225 నగరాల్లో తమ ఖర్చులను తగ్గించుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో తమ కంపెనీ లాభాలను పెంచుకునేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఆర్డర్ ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికి గోల్డ్(Gold subscription) సబ్‌స్క్రిప్షన్‌ను ప్రారంభిస్తున్నట్లుగా జొమాటో(Zomato) వెల్లడించింది. ఈ పథకంలో భాగంగా 9 లక్షల మంది సభ్యులుగా చేరినట్లు జొమాటో కంపెనీ తెలిపింది.
ఇప్పటి వరకూ ఇండియాలో ఎక్కువగా ఉపయోగించే ఫుడ్ డెలివరీ యాప్(Food delivery App)లలో జొమాటో(Zomato) కూడా ఒకటి. కంపెనీ ఫుడ్ ఆర్డర్, డెలివరీ వ్యాపారం దేశంలోని 1000 కంటే ఎక్కువ నగరాల్లో నడుస్తోంది. ప్రతి యూజర్ జొమాటో సేవల్ని వినియోగించుకుంటూ మంచి ఫీడ్ బ్యాక్ కూడా ఇస్తున్నారు. అయతే 2023 మూడో త్రైమాసికంలో కంపెనీ నష్టం 5 రెట్లు పెరిగిందని జొమాటో(Zomato) తెలిపింది. దీని వల్ల రూ.343 కోట్లు నష్టం చవిచూసినట్లు వెల్లడించింది. అయితే ఆదాయం వార్షిక ప్రాతిపదికన చూసినట్లైతే రూ.1,112 కోట్ల నుంచి రూ.1,948 కోట్లకు 75 శాతం వృద్ధి చెందినట్లుగా జొమాటో(Zomato) వెల్లడించింది. అందుకే ఖర్చులను తగ్గించుకోవాలన్న ప్రణాళికను జొమాటో తమ ప్రతినిధులతో చర్చించింది. ప్రణాళికలో భాగంగా దేశంలోని 225 చిన్న నగరాల్లో తమ సేవలను నిలిపివేస్తున్నట్లు జొమాటో(Zomato) నిర్ణయించుకుంది.