• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

మసీదులో ఆత్మాహుతి దాడి.. 50 మందికి తీవ్రగాయాలు

పాకిస్థాన్ లోని పెషావర్ లో దారుణం చోటు చేసుకుంది. పెషావర్ లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మసీదులో నమాజ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పోలీస్ లైన్స్ ఏరియాలో ఉన్న మసీదులో పార్థనలు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి మసీదు లోపలికి వచ్చి తనకు తాను పేల్చుకున్నట్టు ప్రత్యక్ష సాక్షు...

January 30, 2023 / 03:14 PM IST

డీపీటీ అంటే దోచుకో, పంచుకో, తినుకో: సీఎం జగన్ కొత్త భాష్యం

ప్రతిపక్షాలపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విమర్శల దాడి పెంచాడు. తన పాలన వైఫల్యాలపై మూకుమ్మడిగా దాడి చేస్తుండడంతో జగన్ వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. పొత్తులు లేవని.. తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయని.. తాను సింహంలా ఒక్కడినే వస్తానని చెప్పారు. తనకు భయం లేదని.. ప్రజలను, దేవుడిని నమ్ముకున్నట్లు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో సోమవారం జగనన్న చేదోడు మూడో విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహిం...

January 30, 2023 / 01:39 PM IST

ఉత్తరాంధ్రుల కోసం కేసీఆర్ తోనైనా మాట్లాడుతా: ఏపీ స్పీకర్

ఉత్తరాంధ్రుల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తాను మాట్లాడుతానని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. తెలంగాణలో నివసిస్తున్న ఉత్తరాంధ్ర కులాలను బీసీలుగా గుర్తించేందుకు అవసరమైతే సీఎం కేసీఆర్ ను కోరుతానని ప్రకటించారు. కళింగ సామాజిక వర్గం మొత్తం తమ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖపట్టణంలో సోమవారం నిర్వహించిన కళింగ ఆత్మీయ వేదికకు స్పీకర్ తమ్మినేని...

January 30, 2023 / 12:59 PM IST

విజేతగా నిలిచిన అండర్‌-19 భారత్ జట్టుకి భారీ నజరానా

దక్షిణాప్రికా వేదిక జరిగిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ నెగ్గిన భారత జట్టుకు బీసీసీఐ భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది. ఈ విజయానికి పురస్కారంగా యంగ్ ఇండియాకు రూ.5 కోట్లు అందించనున్నట్లు బీసీసీఐ కార్యదర్మి జై షా ఒక ప్రకటనలో తెలిపారు. ఇది మనమంతా గర్వించదగ్గ తరుణంమని జై షా అన్నారు. ఈ విజయం దేశంలో మహిళల క్రికెట్‌కు ఇది మరింత తోడ్పాటునందిస్తుంది. ఈ విజయంలో భాగస్వాములైన ప్లేయర్లు, జట్టు కోచింగ్ సిబ్బంది...

January 30, 2023 / 12:28 PM IST

మేం సత్యవంతులం కాదు.. నోరు జారిన మరో వైసీపీ ఎమ్మెల్యే

అవినీతి అనేది కొత్తేమీ కాదని.. తామేమి సత్యవంతులం కాదని ఓ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నోరు జారాడు. గత ప్రభుత్వం అధికంగా అవినీతి జరిగింది.. మా ప్రభుత్వం కొంత జరుగుతోంది అని తెలిపాడు. ఇది మరింత తగ్గించేందుకే తాము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అంటే వైఎస్ జగన్ పాలనలో అవినీతి జరుగుతుందని పరోక్షంగా ఆ ఎమ్మెల్యే అంగీకరించినట్టు కనిపిస్తోంది. ఇలా తమ పాలన లోపాలను సొంత పార్టీ ఎమ్మెల్యేలే బయటకు చెబ...

January 30, 2023 / 11:23 AM IST

పెళ్లిచూపుల్లో అమ్మాయి ‘నో’.. కాల్వలోకి దూకిన యువకుడు

పెళ్లిచూపులకు వెళ్లగా.. తనను వివాహం చేసుకోవడానికి అమ్మాయి నిరాకరించడంతో ఓ యువకుడు మనస్తాపం చెందాడు. ఆమె తిరస్కరించడాన్ని తట్టుకోలేక కాళేశ్వరం గ్రావిటీ కాల్వలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నాన్నా.. ఓ పెళ్లి కోసం పరకాల వెళ్తున్నా’ అని ఇంట్లో చెప్పేసి కారులో వెళ్లిన యువకుడు కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ సంఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఫారిన్ పిల్లతో ఫేస్ బుక్ లవ్.. 11 ఏళ్ల...

January 30, 2023 / 10:49 AM IST

షూటింగ్ షురూ.. కడపలో భారతీయుడు-2 సందడి

భారతీయుడు-2 చిత్రీకరణ కోసం ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఏపీలోని కడప జిల్లాకు వచ్చాడు. చిత్రీకరణ కోసం ఆరు రోజుల పాటు కడపలో ఉండనున్నాడు. అయితే షూటింగ్ కోసం వచ్చిన కమల్ హాసన్ ను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ప్రజలు భారీగా తరలిరావడంతో కమల్ హాసన్ బయటకు వచ్చి పలకరించారు. అందరికీ నమస్కారం అంటూ చేతులు ఊపారు. దీనివలన షూటింగ్ కు కొంత అంతరాయం ఏర్పడింది. అయినా కూడా పలు జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ ను కొనసాగిస్తున్...

January 30, 2023 / 10:35 AM IST

సింగర్ కైలాశ్ ఖేర్‌పై దాడి.. బాటిల్ విసిరిన వ్యక్తి, అరెస్ట్

ప్రముఖ నేపథ్య గాయకుడు కైలాశ్ ఖేర్‌పై దాడి జరిగింది. ఓ వ్యక్తి అతనిపై బాటిల్ విసిరేశాడు. ఈ ఘటన కర్ణాటకలో గల హంపీలో జరిగింది. సంగీత కచేరి నిర్వహిస్తోండగా భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. ఇంతలో ఒకతను దాడి చేశాడు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. హంపీలో సంగీత ప్రదర్శన ఇస్తుండగా.. కొందరు యువకులు అతి చేశారు. వేదిపై కైలాశ్ ఖేర్ పాటలు పాడుతుండగా.. ప్రేక్షకుల గ్యాలరీ నుంచి యువకులు వాటర్‌ బాటిల...

January 30, 2023 / 02:23 PM IST

అది నాపై దాడి కాదు.. భారతదేశంపైనే దాడి: అదానీ

అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలు తమపై చేసినవి కాదని ఏకంగా భారతదేశం మొత్తంపై చేసిన దాడిగా భారత వ్యాపార దిగ్గజం, అపర కుబేరుడు గౌతమ్ అదానీ అభివర్ణించాడు. అది తమ సంస్థపై చేసిన దాడి కాదని భారతదేశం, భారతీయ సంస్థలు, స్వాతంత్య్రం , నాణ్యత, ఆర్థిక వృద్ధిపై దాడిగా పేర్కొంది. హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టి పారేసింది. తప్పుడు ఆరోపణలని, అవాస్తవాలు, నిరాధారామైనవని పేర్కొంది. ఈ స...

January 30, 2023 / 08:26 AM IST

విశాఖనే రాజధాని..? ఫైవ్ స్టార్ హోటల్ కు 40 ఎకరాలు

పరిపాలన రాజధానిగా కొన్ని నెలల్లో విశాఖపట్టణాన్ని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే పలు కార్యాలయాలు తరలించేందుకు సిద్ధమైంది. విశాఖ నుంచే పరిపాలన సాగించాలనే పట్టుదలతో సీఎం జగన్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ సమ్మిట్ కూడా అక్కడే నిర్వహించనున్నారు. ఇక ఏపీ రాజధాని విశాఖనే అని చాటి చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తున్నది. అందుకే అన్ని కార్యక్రమాలకు విశాఖతో...

January 30, 2023 / 08:02 AM IST

బడ్జెట్ పై పేచీ: గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ముదిరిన వివాదం

తెలంగాణలో గవర్నర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం తారస్థాయికి చేరింది. వార్షిక బడ్జెట్ ను శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టేందుకు ఇంకా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అనుమతి ఇవ్వలేదు. బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. బడ్జెట్ ప్రతిపాదనలు, సిఫారసులతో సమావేశాల్లో ప్రవేశపెట్టాలి. కానీ దీనికి గవర్నర్ నుంచి ఇంకా ఆమోదం లభించలేదు. దీనిపై హైకోర్టుకు వెళ్లే ఆలోచనలు తెలంగాణ ప్రభుత్వ...

January 31, 2023 / 07:05 AM IST

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్.. అందుకేనా ఈ పర్యటన?

అంతా భావిస్తున్నట్టుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. సోమ, మంగళవారాల్లో జగన్ దిల్లీలో పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 6.45 గంటలకు దిల్లీ చేరుకుంటారు. వన్‌ జన్‌పథ్‌ నివాసంలో రాత్రికి బస చేస్తారు. ఈనెల 31న ఉదయం 10.30 గంటలకు దిల్లీలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో దౌత్యవేత్తలతో జరగనున్న ఏపీ గ్లోబల్‌ సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ స...

January 30, 2023 / 08:07 AM IST

మావోడు క్షేమం.. తారకరత్న ఫైటర్: మంచు మనోజ్

బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను నటుడు మంచు మనోజ్ పరామర్శించారు. ఆదివారం రాత్రి బెంగళూరుకు చేరుకున్నాడు. ఆస్పత్రిలోకి వెళ్లి వచ్చిన అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడాడు. తారకరత్నను చూశానని.. కోలుకుంటున్నాడని తెలిపారు. తారక్ ఫైటర్ అని.. చాలా యాక్టివ్ గల వ్యక్తి అని త్వరలో క్షేమంగా బయటకు వస్తాడని తెలిపాడు. ‘తారకరత్నను చూశా. కోలుకుంటున్నాడు. చిన్నప్పటి నుంచి...

January 29, 2023 / 09:26 PM IST

అండర్-19 టీ20 ప్రపంచకప్ విజేత భారత్.. భళా అమ్మాయిలు

తొలిసారి నిర్వహించిన అండర్-19 టీ20 ప్రపంచకప్ లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. ఇంగ్లండ్ ను చిత్తు చేసి తొలి ట్రోఫీని చేజిక్కించుకుని సత్తా చాటారు. అండర్-19లో తొలిసారిగా నిర్వహించిన పొట్టి ప్రపంచ కప్ లో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లిష్ అమ్మాయిలు 69 పరుగులు లక్ష్యం విధించగా భారత్ సునాయాసంగా లక్ష్యం సాధించి ప్రపంచకప్ ను ముద్దాడింది. తొలుత బ్యాటింగ్...

January 29, 2023 / 09:09 PM IST

ఒడిశా మంత్రి నబా దాస్ మృతి..బుల్లెట్ గాయాలతో రక్తస్రావం

ఒడిశా మంత్రి నబా కిషోర్ దాస్‌ తుదిశ్వాస విడిచారు. ఎఎస్ఐ గోపాల్ దాస్ కాల్పులు జరపడంతో తీవ్ర రక్తస్రావమైంది. తొలుత బ్రజ్ రాజ్ నగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి భువనేశ్వర్ అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. దగ్గర నుంచి ఛాతీపై గోపాల్ దాస్ కాల్పులు జరిపాడు. మరో ముగ్గురు కూడా గాయపడ్డారట. మంత్రి నబా దాస్ జార్పుగూడ జిల్లా బ్రజ్ రాజ్ నగర్‌కు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. గాంధీ సెంటర్ వద్ద కారు ...

January 29, 2023 / 08:19 PM IST