సతీశ్ మృతి పట్ల తెలంగాణ మంత్రులు హరీశ్ రావు (T Harish Rao), సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) సంతాపం తెలిపారు. 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం (Millets Year)గా చేసుకుంటున్న సమయంలోనే సతీశ్ మృతి చెందడం తీరని లోటు అని మంత్రులు పేర్కొన్నారు.
గడ్డి మొలకెత్తని పొలాల్లో సిరుల పంట పండించిన వ్యక్తి.. పాత పంటలు, సంప్రదాయ పంటలు, చిరుధాన్యాల (Millets) సంరక్షణను ఉద్యమంగా చేపట్టి మిల్లెట్ మ్యాన్ (Millet Man)గా గుర్తింపు పొందిన పీవీ సతీశ్ (77) (PV Sateesh) మృతి చెందారు. హైదరాబాద్ (Hyderabad)లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతికి తెలంగాణ మంత్రులు, వ్యవసాయ రంగ నిపుణులు, ఇతర ప్రముఖులు సంతాపం తెలిపారు.
1945 జూన్ 18న కర్ణాటకలోని మైసూర్ (Mysore)లో జన్మించిన సతీశ్ న్యూఢిల్లీలోని ఐఐఎంలో మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పట్టా అందుకున్నారు. జర్నలిస్టు (Journalist)గా జీవితం ప్రారంభించిన సతీశ్ రెండు దశాబ్దాల పాటు టీవీ నిర్మాతగా పని చేశారు. అనంతరం వ్యవసాయం (Agriculture)పై మక్కువ పెంచుకున్నారు. సంగారెడ్డి జిల్లా (Sangareddy District) జహీరాబాద్ (Zaheerabad) మండలం పస్తాపూర్ గ్రామంలో 1983లో డెక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ (డీడీఎస్) నెలకొల్పారు.
చిరుధాన్యాలు, పాత పంటలు, సంప్రదాయ పంటల సంరక్షణపై ఉద్యమం మొదలుపెట్టారు. ఆయన సేవలకు యునైటెడ్ నేషనల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ లలో ఈక్వేటర్ బహుమతి లభించింది. వృక్షమిత్ర అవార్డు సొంతం చేసుకున్నారు. భారతదేశంలో మొట్టమొదటి కమ్యూనిటీ మీడియా ట్రస్ట్ ను ప్రారంభించిన తొలి వ్యక్తి సతీశ్ కావడం విశేషం. నిరక్షరాస్యులైన దళిత మహిళలను ప్రోత్సహించి వారికి మీడియా, వీడియో రంగంలో శిక్షణ ఇప్పించారు.
సతీశ్ మృతి పట్ల తెలంగాణ మంత్రులు హరీశ్ రావు (T Harish Rao), సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) సంతాపం తెలిపారు. 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం (Millets Year)గా చేసుకుంటున్న సమయంలోనే సతీశ్ మృతి చెందడం తీరని లోటు అని మంత్రులు పేర్కొన్నారు. కాగా సతీశ్ అంత్యక్రియలు నేడు ఉదయం వస్తాపూర్ గ్రామంలో జరుగనున్నాయి.