»Kavita Went To Delhi In A Special Flight With Ktr
MLC KAVITHA: కేటీఆర్‌తో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్(Liquor Scam)లో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC KAVITHA) తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. మార్చి 11న కవిత ఈడీ(ED) విచారణకు కూడా హాజరైంది. అయితే మార్చి 16న మరోసారి కవితను విచారణకు రమ్మంటూ ఈడీ నోటీసులిచ్చింది. కానీ ఆ తర్వాత ఆమె ఈడీ(ED) సమన్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ఈడీ కార్యాలయంలో ఓ మహిళ విచారణపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేశారు. అయితే సుప్రీం దీనిపై తక్షణ విచారణ చేయడానికి నిరాకరించింది.

మార్చి 24వ తేదిన సుప్రీం ఈ కేసును విచారిస్తామని తెలిపింది. బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC KAVITHA) మార్చి 16న ఈడీ(ED) విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంది. తన వ్యక్తిగత, వ్యాపార వివరాలను ప్రతినిధి ద్వారా ఈడీకి అందజేసింది. అయితే 20న కచ్చితంగా కవిత ఈడీ(ED) ఎదుట హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది.
ఈడీ(ED) నోటీసుల నేపథ్యంలో నేడు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కవిత(MLC KAVITHA) ఢిల్లీకి వెళ్లింది. కేటీఆర్(KTR)తో పాటు కవిత ఢిల్లీకి తరలివెళ్లింది. వీరి వెంట బీఆర్ఎస్(BRS) ఎంపీ సంతోష్ ఉన్నారు. సుప్రీం కోర్టులో ఆమె పిటిషన్ వేసిన దానిపై విచారణ ఇంకా జరగలేదు. దీంతో రేపు ఆమె ఈడీ(ED) ఎదుట వ్యక్తిగతంగా హాజరవుతారా? లేక తన న్యాయవాదిని పంపుతారా అనేది తెలియాల్సి ఉంది.