»Revanth Reddy Said Ktr Pa Tirupati Involvement In Tspsc Leak Case
Revanth Reddy: TSPSC లీకేజీ విషయంలో KTR పీఏ పాత్ర ఉంది
TSPSC లీకేజీ వ్యవహరంలో మంత్రి కేటీఆర్(KTR) పీఏ తిరుపతి(PA Tirupathi) పాత్ర ఉందని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. అతని గ్రామంలో గ్రూప్-1 ఎగ్జామ్ రాసిన వంద మందికి 100కుపైగా మార్కులు వచ్చినట్లు తెలిపారు. దీనిపై కూడా విచారణ చేయాలని కోరారు. మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో ఇప్పుడే లీకేజీ జరిగినట్లు మాట్లాడుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. 2015, 2017లో సింగరేణి ఉద్యోగాల భర్తీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపణలు ఎదుర్కొన్నారని ఆరోపించారు. ఎంసెట్ ప్రశ్నపత్రాల లీకేజీ, ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం తప్పుగా ఉండడంతో 25 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని గుర్తు చేశారు.
TSPSC పేపర్ లీకేజీ విషయంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లీక్ వ్యవహారంలో మంత్రి కేటీఆర్(ktr) పీఏ తిరుపతి(pa tirupathi) పాత్ర ఉందని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా మల్యాల మండలంలోని తిరుపతి స్వస్థలంలో గ్రూప్ -1 రాసిన(group 1 exam) 100 మందికి వందకు పైగా మార్కులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ లీకేజీ కుంభకోణంలో ఇద్దరు వ్యక్తుల ప్రమేయం మాత్రమే ఉందని డ్రామారావు తమ పార్టీ నేతలను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో లోయర్ గ్రేడ్ ఉద్యోగులను బలిపశువులను చేస్తూ BRSని కాపాడుతున్నారని ఎద్దేవా చేశారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ‘హాత్ సే హాత్ జోడో’ పాదయాత్రలో భాగంగా రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పేపర్ లీక్ కేసుతో ఐటీ మంత్రిగా తనకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్(KTR) చెబుతున్నారు. అలాటి వ్యక్తి బాధ్యత లేనప్పుడు సీఎం నిర్వహించిన సమీక్షలో ఎందుకు పాల్గొన్నారని రేవంత్ ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి సబితానో లేదా మరో మంత్రి శ్రీనివాసగౌడ్ ఎందుకు మాట్లాడలేదన్నారు. మీరు ఐటీ మంత్రిగా ఉండి మీడియాతో ఎలా మాట్లాడారని నిలదీశారు. ఈ పేపర్ లీకేజీ వ్వవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు. అన్ని పోటీ పరీక్షల ప్రశ్నా పత్రాలు బీఆర్ఎస్(BRS) ప్రభుత్వమే లీక్ చేసిందని, దోషులను ఉరితీయాలని అన్నారు.
ఈ లీకేజీ విషయంలో ఇదే తొలిసారి అన్నట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. 2015లో సింగరేణి(SCCL) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో పేపర్ లీక్ అయింది. అందులో కవిత ప్రమేయం కూడా ఉందనే ఆరోపణలు వచ్చాయి. 2016లో ఎంసెట్ ప్రశ్నపత్రం లీక్ అయింది. దీంతో అభ్యర్థులు మూడుసార్లు ఎంసెట్ పరీక్ష రాయాల్సి వచ్చిందని రేవంత్ తెలిపారు. ఆ తర్వాత 2017లో మరోసారి సింగరేణి రిక్రూట్మెంట్ ప్రశ్నపత్రం లీక్. 2019లో ఇంటర్ మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగింది. 60 వేల మంది విద్యార్థుల(students) జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంది. అనుభవం లేని గ్లోబెరినాకు ఇంటర్ మూల్యాంకనం అప్పగించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్లోబరీనా అంటూ ప్రశ్నించిన మధుసూదన్ రెడ్డిపై ఏసీబీ(ACB) దాడులు చేసి జైల్లో పెట్టారు.
ఇవన్నీ లీకేలీజులు జరిగినా కూడా ప్రస్తుతం పరీక్షలను రద్దు చేయడమే గొప్ప అన్నట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో జరిగిన అన్ని నియామకాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు(KCR) ఇక్కడి పరిపాలనపై కనీస ఆసక్తి లేకుండా భారత రాష్ట్ర సమితి (BRS) విస్తరణలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం వేలాది మంది బలిదానాలు చేస్తే కాంగ్రెస్ చలించిపోయి తెలంగాణ ఇచ్చిందని రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. కానీ కేసీఆర్ సీఎం అయిన తర్వాత బాధ్యతారాహిత్య పరిపాలనతో రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నారని విమర్శించారు.