ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC kavitha)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సుప్రీంకోర్టు(Supreme Court)లో కేవియట్ పిటిషన్(caveat petition) దాఖలు చేసింది. కవిత పిటిషన్‌పై ఏజన్సీ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని ఈడీ సుప్రీంకోర్టును కోరింది. ఈ కేసులో నిందితులైన అరుణ్ రామచంద్ర పిళ్లై, ఇతరులతో ఆమెను ఎదుర్కోవడానికి మార్చి 20న ఏజెన్సీ ముందు హాజరుకావాలని కవితకు ఈడీ ఇప్పటికే సమన్లు పంపింది. అయితే మార్చి 20న ఏజెన్సీ ముందు హాజరు కావడంపై కవిత ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi Liquor Scam Case)లో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఈడీ(ED) శనివారం సుప్రీంకోర్టు(Supreme Court)లో కేవియట్ పిటిషన్(caveat petition) దాఖలు చేసింది. ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కె.కవిత(BRS MLC kavitha) దాఖలు చేసిన పిటిషన్‌పై తమ వాదనలను కూడా వినాలని సుప్రీంకోర్టుకు తెలిపారు. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయవద్దని ఈడీ కోర్టును కోరింది. దీంతో కవిత తరఫు లాయర్‌తో పాటు ఈడీ వాదనలను సుప్రీంకోర్టు విననుంది. ఆ తర్వాత కవిత పిటిషన్‌పై కోర్టు తీర్పు వెలువరించనుంది. దీంతో ఈ కేసు ప్రస్తుతం మరింత ఆసక్తికరంగా మారింది.
ED మొదట కవిత(kavitha)కు సమన్లు జారీ చేసింది. ఆ తర్వాత ఆమె మార్చి 11న విచారణకు హాజరయ్యింది. మార్చి 16న మళ్లీ విచారణకు హాజరు కావాలని ED ఆమెను కోరింది. ఆ తర్వాత ఆమె ఈడీ సమన్లను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ కార్యాలయంలో ఓ మహిళ విచారణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కవిత పిటిషన్(petition) దాఖలు చేశారు. అయితే అత్యున్నత న్యాయస్థానం ఈ కేసులో ఆమెకు తక్షణ విచారణ చేయడానికి నిరాకరించింది. మార్చి 24కి కేసును విచారిస్తామని చెప్పడంతో.. కవిత మార్చి 16న ED ఎదుట హాజరు కాకుండా తప్పించుకుంది. తన వ్యక్తిగత, వ్యాపార వివరాలను ప్రతినిధి ద్వారా పంపింది. మరోవైపు ఉన్నత న్యాయస్థానం(Supreme Court) ముందు తాను దాఖలు చేసిన పిటిషన్ కూడా ఉన్నట్లు తెలియజేసింది.
దీంతో ఈ నెల 20న మరోసారి విచారణకు కవిత హాజరు కావాలని ఈడీ(ED) నోటీసులు(notice) జారీ చేసింది. ఈ పరిణామాన్ని పరిశీలించిన ఈడీ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. తమ వాదనలు విన్న తర్వాతే ఈ కేసులో ఆర్డర్ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. ఈ పరిణామాల నేపథ్యంలో రేపు(మార్చి 20)న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ(BRS MLC kavitha) కవిత మళ్లీ ఈడీ ఎదుట హాజరు అవుతుందా లేదా మళ్లీ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందా అనేది చూడాలి. అయితే మార్చి 20న ఏజెన్సీ ముందు హాజరు కావడంపై కవిత ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.