»Telugu Director Comments Your Eyes Are Not Large In Size Actress Himaja Emotional
Himaja Emotional: అవి పెద్ద సైజులో లేవని ఓ డైరెక్టర్ కామెంట్లు
ఉన్నది ఒకటే జిందగీ సహా పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హిమజా మల్లిరెడ్డి(Himaja Mallireddy) తన బాడీ షేమింగ్ గురించి ఓ డైరెక్టర్(director) సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. తన రెండు కళ్లు పెద్దవిగా లేవని, తాను అబ్బాయిల మాదిరిగా నడుస్తాయనని ఓ దర్శకుడు అన్నట్లు వెల్లడించింది. ఆ క్రమంలో తాను చాలా ఏడ్చానని తెలిపింది.
సమాజంలో నెగిటివ్, పాజిటివ్ రెండూ ఉంటాయని..మనం ఏది తీసుకుంటే మనకు అదే గుర్తింపు వస్తుందని నటి హిమజా మల్లిరెడ్డి(Himaja Mallireddy) అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే తాను టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు. తన రెండు కళ్లు పెద్దగా లేవని ఓ దర్శకుడు(director) కామెంట్లు చేశారని చెప్పుకొచ్చింది. అంతేకాదు నడక కూడా అబ్బాయిల మాదిరిగా ఉంటుందని అన్నారని తెలిపింది. ఆ క్రమంలో తాను చాలా ఏడ్చానని(crying) చెప్పింది. కానీ తర్వాత తనలో పట్టుదల పెరిగి మళ్లీ అవకాశాల కోసం ప్రయత్నించినట్లు వెల్లడించింది.
అంతేకాదు తాను మేకప్ వేసుకుని తన కళ్లను(eyes) చూసుకుంటే సరిగానే అనిపించేవని తెలిపింది. ఆ తర్వాత తనకు పలు చిత్రాల్లో ఆఫర్లు వచ్చిన తర్వాత కామెంట్లు చేసిన వారే మెచ్చుకున్నారని పేర్కొంది. ఇక అప్పటి నుంచి తాను విమర్శలను పట్టించుకోవడం లేదని తెలిపింది. మనం చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది. మరోవైపు తనకు సోషల్ వర్క్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో తన కారు డ్రైవర్(driver)కు ముగ్గురు ఆడపిల్లులు ఉన్నట్లు తెలిపింది. వారి చదువు బాధ్యతను తానే చూసుకుంటున్నట్లు హిమజా ఎమోషనల్ అవుతూ చెప్పింది.
నటి హిమజా మల్లిరెడ్డి(Himaja Mallireddy) ఏపీలోని గుంటూరు జిల్లా(guntur district) వీర్లపాలెంలో జన్మించింది. ఈ అమ్మడు మొదట సర్వాంతర్యామి అనే టెలి ఫిల్మ్‌లో నటించింది. ఆ క్రమంలో పలు షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరించారు. తర్వాత పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది. ఈ నేపథ్యంలో కొంచెం ఇస్తం కొంచెం కష్టం, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి వంటి చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా పాల్గొని 63వ రోజున బయటకు వచ్చేసింది. ఆ తర్వాత కూడా కనబడుట లేదు, వరుడు కావలెను వంటి పలు చిత్రాల్లో నటించింది. హిమజా నటించిన చివరి చిత్రం 2022లో వచ్చిన టెన్త్ క్లాస్ డైరీస్.