భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) నిర్దేశించిన మూడేళ్ల లాక్-ఇన్(lock-in time) వ్యవధి ముగిసిన తర్వాత యెస్ బ్యాంక్ షేర్లు దాదాపు 12.75% క్షీణించాయి. ఏడేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ బ్యాంక్ షేర్లు 15.85 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.
Viral News : ఎయిర్ ఇండియా విమానంలో స్మోక్ చేసినందుకు ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లండన్ నుండి ముంబయి వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి దూమపానం చేయడంతో ఆయనమీద కేసు నమోదు చేశారు. ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. వాష్‌రూమ్‌లోకి వెళ్లి సిగరెట్ వెలిగించగానే అక్కడ ఉన్న స్మోక్ అలారమ్ మోగింది.
ఎన్నికల్లో నిలిపిన సామాన్య వ్యక్తులు.. ముఖ్యంగా యువత సీనియర్లను పక్కకు నెట్టేసి ఎమ్మెల్యేలుగా విజయం సాధించి ప్రత్యేకత చాటారు. పంజాబ్ లో ఎన్నికైన వారిలో ఇంకా అవివాహితులు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారు కూడా బ్రహ్మచారులు ఉన్నారు. మరికొందరు బ్రహ్మాచారులుగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా త్వరలో పెళ్లి చేసుకోనున్నారు.
ప్రముఖ హీరో సాయి కుమార్(sai kumar) కొడుకు ఆది(Aadi sai kumar) తన సినిమాలు ఆడటం లేదని డిప్రెషన్(depression)లోకి వెళ్లారా? వరుసగా తన చిత్రాలకు కలెక్షన్లు రావడం లేదని బ్లాక్ జోన్ లోకి వెళ్లారా? అందేటో తెలియాలంటే ఈ వార్తను చదివేయండి మీకే తెలుస్తుంది.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు ఇచ్చింది అకాడమీ నిర్వాహకులు కాదు.. ప్రధాని మోదీ వలనే ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది అని చెబుతారు’ అంటూ బీజేపీ నాయకులను చెబుతారని తన ట్వీట్ ద్వారా చెప్పారు.
నిజామాబాద్ జిల్లా(nizamabad district) చాంద్రాయణ్ పల్లి శివారులోని 44వ నెంబరు జాతీయ రహదారిపై ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(road accident) సంభవించింది. కారు(car) అతివేగంతో కంటైనర్ లారీని(heavy lorry) వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారు(car)లో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.
30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలు చూస్తుంటే మంత్రి కేటీఆర్ కు పోటీగా వస్తున్నారా అనే సందేహం ఏర్పడుతుంది. కాగా ఎర్రబెల్లి సరదాగా తన గొప్పతనం చెప్పుకునేందుకు ఈ వ్యాఖ్యలు చేశారని.. పార్టీలో నంబర్ -2 కోసం కాదని తేలడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.
ఓ చికెన్(Chicken) షాపు(shop) నిర్వహకులు తమ ప్రాంత వాసులకు క్రేజీ ఆఫర్(offer)ను ప్రకటించారు. అరకిలో చికెన్ ఐదుపైసల(five paise coin) నాణానికే ఇస్తామని అనౌన్స్ చేశారు. దీంతో అక్కడి స్థానికులతోపాటు చుట్టుపక్కల జనాలు సైతం పాత ఐదుపైసల నాణాల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. అవి దొరికిన వెంటనే ఆఫర్ ప్రకటించిన చికెన్ షాపుకు వెళ్లి చికెన్ తెచ్చుకున్నారు. ఈ సంఘటన ఏపీ(ap)లోని నెల్లూరు జిల్లా(nellore district)...
ఆస్కార్ పురస్కారం సొంతం చేసుకున్న తొలి భారతీయ సినిమా ఆర్ఆర్ఆర్. ప్రతిష్టాత్మక అవార్డు సొంతం చేసుకోవడంపై భారతదేశం ఉప్పొంగుతోంది. తెలుగు సినిమా గర్విస్తోంది. అవార్డు అందుకున్న ఆనందంలో ఆ చిత్ర బృందం ఆనందంతో ఉబ్బితబ్బిబవుతోంది. కాగా భారతదేశానికి ఉత్తమ షార్ట్ ఫిల్మ్ విభాగంలో కూడా ఆస్కార్ దక్కింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏపీలో మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ, మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ(mlc elections) స్థానాలకు గాను పోలింగ్(polling) జరుగుతోంది. మరోవైపు తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
ఓ కబేలా బేరగాడి దౌర్జన్యానికి అభం శుభం తెలియని మూగ జీవి మృత్యువాత చెందింది. ఓ రైతు తన ఆర్థిక అవసరాల నిమిత్తం ఓ పశువుల సంతకు వెళితే.. అక్కడి వ్యాపారులు కుమ్మకై ఓ దూడ విషయంలో కర్కషంగా ప్రవర్తించి దాని మృతికి కారకులయ్యారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా(Suryapet District)లోని కోదాడ(kodad)లో చోటుచేసుకుంది.
RRR చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల అనేక మంది భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సహా ఎఆర్ రహమాన్, బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ సహా పలువురు ప్రముఖులు RRR టీమ్‌ని అభినందించారు.
ట్విటర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, స్నాప్ చాట్, షేర్ చాట్ ఇలా అన్ని సామాజిక మాధ్యమాల్లో నాటునాటు పాట ట్రెండింగ్ లో కొనసాగుతున్నది. #NaatuNaatu , #RRRMovie #Teulugu ప్రపంచవ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్న నాటునాటు పాట ప్రతిష్టాత్మక అవార్డు (Award) సొంతం చేసుకోవడంతో ఇక భారతీయుల ఆస్కార్ దాహాన్ని తీర్చేసింది.
95వ ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో 'RRR'లోని 'నాటు నాటు' ఉత్తమ ఒరిజినల్ సాంగ్(Best Original Song Award) అవార్డును గెలుచుకుంది. దీంతో దక్షణాది నుంచి అవార్డు గెలుచుకున్న తొలి చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డు సృష్టించింది. MM కీరవాణి ఈ పాటకు మ్యూజిక్ అందించగా.. చంద్రబోస్ సాహిత్యం, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ స్వరాలు అందించారు.
రిజిస్టర్ (Register)లో సంతకం చేసి లోపలికి వెళ్లాడు. వెళ్లిన వ్యక్తి ఎంతకీ బయటకు రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. ఆయన లోపల ఎక్కడా కనిపించకపోవడంతో డిపో అంతా ఉద్యోగులు గాలించారు. ఫోన్ చేస్తే ఎత్తడం లేదు.