»India Vs Australia India Won 1st Odi Kl Rahul 75 Plus Not Out
IND vs AUS 1st ODI: టీమిండియా ఘన విజయం
ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్(ODI Match)లో టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భాగంగా మొదట టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేపట్టింది. బరిలోకి దిగిన ఆసీస్(Ausis) బ్యాటర్లు 188 పరుగులకు ఆలౌట్(All Out) అయ్యారు. ఆ తర్వాత బరిలోకి దిగిన భారత్ 191 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.

తొలి వన్డే మ్యాచ్ లో భారత్‌ను కేఎల్ రాహుల్(KL RAHUL) గెలిపించాడు. టీమిండియా(Team India) ఓపెనర్లు ఇషాన్ కిషన్ 3, శుభ్ మన్ గిల్ 20 పరుగులకు పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 4, సూర్యకుమార్ యాదవ్ 0, హార్దిక్ పాండ్యా 25 పరుగులు చేసి ఔట్ అయ్యారు. ఇటువంటి పరిస్థితిలో టీమిండియా(Team India) గెలుస్తుందా? లేదా అని అందరూ సందేహించారు.
అయితే 5వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కేఎల్ రాహుల్(KL RAHUL) అద్భుతంగా ఆడాడు. 91 బంతుల్లో 75 పరుగులు చేసి టీమిండియా(Team India)కు విజయాన్ని అందించాడు. కేఎల్ రాహుల్ కు ఇది 13వ అర్ధ సెంచరీ కావడం విశేషం. రాహుల్ కు రవీంద్ర జడేజా(Ravindra Jadeja) నుంచి మంచి సహకారం లభించింది. రవీంద్ర జడేజా కూడా 45 రన్స్ చేశాడు. వీరిద్దరూ క్రీజులో నిలబడి నిలకడగా ఆడారు. దీంతో భారత్ 39.5 ఓవర్లలో 191 పరుగులు చేసి విజయం సాధించింది.
టీమిండియా(Team India) 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసి ఘన విజయం(Victory) సాధించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఈమధ్య కాలంలో టెస్టు మ్యాచుల్లో కేఎల్ రాహుల్(KL RAHUL) ఘోరంగా విఫలమవుతూ వచ్చాడు. అతడిని జట్టులోకి తీసుకోవద్దని చాలా మంది అన్నారు. కానీ కేఎల్ రాహుల్ ఇప్పుడు తన ఇన్నింగ్స్ తో వారందరి నోర్లూ మూయించాడు.