CTR: ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారనుందని IMD తెలిపింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. తర్వాత ఈ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే ఛాన్స్ కూడా ఉంది. దీంతో అధికారులు హెచ్చరికలు జారీచేశారు.