W.G: తాడేపల్లిగూడెం శ్రీ దేవి మహంకాళి అమ్మ జాతర ఉత్సవాలకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 14 నుంచి 23 వరకు అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలను నిర్వహించనున్నట్లు అధ్యక్షులు ఎక్కిన నాగబాబు తెలిపారు. ఈ ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రతిరోజు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పాల్గొనాలని కోరారు.