»Rohit Sharma Dances With Wife Ritika Sajdeh At His Brother In Laws Wedding Video
Rohit Sharma భార్యతో కలిసి స్టెప్పులేసిన రోహిత్ శర్మ
టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గురించి, ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా రోహిత్ శర్మ గురించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్ కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గైర్హాజరయ్యారు. దీంతో రోహిత్ స్థానంలోకి హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించారు. రోహిత్ శర్మ(Rohit Sharma) తన బామ్మర్ది వివాహం సందర్భంగా తొలి వన్డే నుంచి తప్పుకున్నారు.

ప్రస్తుతం రోహిత్ శర్మ(Rohit Sharma) తన బామ్మర్ది పెళ్లి వేడుకలో సందడి చేస్తున్నాడు. రోహిత్ శర్మతో పాటుగా ఆయన భార్య కూడా రోహిత్ తో డ్యాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. గురువారం రాత్రి ఈ వివాహ వేడుక జరిగింది. ఈ పెళ్లి వేడుకలో రోహిత్ శర్మ(Rohit Sharma) తన భార్య రితికాతో కలిసి వివాహ వేడుకపై డ్యాన్స్ వేశారు.
వీడియోలో రోహిత్ శర్మ(Rohit Sharma) పాములాగా చేతులు కదుపుతూ తన భార్యతో డ్యాన్స్(Dance) వేశాడు. ఆ తర్వాత తన భార్యపై డబ్బులు కురిపిస్తున్నట్లు చేతులు ఆడిస్తూ అక్కడున్నవారిని ఉర్రూతలూగించాడు. ప్రస్తుతం ఈ వీడియోను చూసిన రోహిత్ అభిమానులు(Rohit Fans) తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రోహిత్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మొదటి వన్డే మ్యాచ్ లో మాత్రమే రోహిత్ శర్మ(Rohit Sharma) ఆడడు. ఆ తర్వాత జరిగే రెండు వన్డేలకు రోహిత్ తిరిగి జట్టులోకి వస్తాడని బీసీసీఐ(BCCI) వెల్లడించింది. మరోవైపు అహ్మదాబాద్ లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగవ టెస్టులో శ్రేయాస్ అయ్యర్ కు గాయం అయ్యింది. వెన్నులో గాయం అవ్వడంతో శ్రేయాస్ అయ్యర్ కూడా వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. దీంతో భారత్ కు ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. మరో వైపు బుమ్రా(Bumrah) కూడా లేకపోవడంతో టీమిండియా(Team India) పేస్ డిపార్ట్మెంట్ కాస్త డల్ గా కనిపిస్తోంది. ఇటువంటి సమయంలో టీమిండియా బ్యాటర్లపై జట్టు ఆధారపడి ఉంది.