»Ram Charan Reached Hyderabad Begumpet Airport Heavy Fans Crowd
Ramcharan: హైదరాబాద్ చేరుకున్న చెర్రీ..అర్థరాత్రి పోటెత్తిన ఫ్యాన్స్
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ హీరో రామ్(ram charan) చరణ్ పలు అవార్డుల కార్యక్రమాల తర్వాత శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్నారు(reached hyderabad). ఈ నేపథ్యంలో బేగంపేట ఎయిర్ పోర్టు(begumpet airport)లో చరణ్ కు అభిమానులు గ్రాండ్ వెలకమ్ చెప్పారు. పూలు పెద్ద ఎత్తున జల్లుతూ సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ పోటెత్తారు.
టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) ఆస్కార్ వేడుక సహా పలు అవార్డుల కార్యక్రమాల తర్వాత శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్నారు(reached hyderabad). ఈ క్రమంలో బేగంపేట ఎయిర్ పోర్టు(begumpet airport)లో చరణ్ కు ఘన స్వాగతం లభించింది. అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పూలతో గ్రాండ్ వెలకమ్ చెప్పారు. మరికొంత మంది చెర్రీ జిందాబాద్ అంటూ అరుపులు చేస్తూ సందడి చేశారు. మరోవైపు రామ్ చరణ్ తో సెల్ఫీ ఫొటోలు దిగేందుకు అభిమానులు భారీగా(fans crowd) ఎగబడ్డారు. ఢిల్లీలో అమిత్ షాతో భేటీ తర్వాత రామ్ చరణ్ హైదరాబాద్ చేరుకున్నారు. రామ్ చరణ్ వచ్చిన క్రమంలో పలువురు అభిమానులు వీడియోలు తీసి సోషల్ మీడియా(social media)లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతున్నాయి.
రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు శంకర్ పర్యవేక్షణలో ‘RC15’ మూవీ చేస్తున్నారు. ‘RC15’ చిత్రాన్ని 2024 పొంగల్‌కు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా, ‘RC15’ నిర్మాతలు, దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని మార్చి 27 న చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
95వ అకాడమీ అవార్డ్స్ 2023 వేడుకల్లో భాగంగా RRR చిత్రంలోని నాటు నాటు పాట ‘ఉత్తమ ఒరిజినల్ సాంగ్’ అవార్డును గెలుచుకుంది. ఇక ఈ చిత్రానికి SS రాజమౌళి దర్శకత్వం వహించగా..రామ్ చరణ్, Jr NTR హీరోలుగా నటించారు. MM కీరవాణి ఈ పాటకు మ్యూజిక్, చంద్రబోస్ సాహిత్యం అందించగా.. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ స్వరాలు సమకూర్చారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాట మార్చి 2022లో విడుదలైన వెంటనే ఎక్కువగా ప్రజాధారణ పొందింది.