Ram Charan : మరో దర్శకుడికి చరణ్ హ్యాండ్ ఇచ్చాడా!?
Ram Charan : మెగా పవర్ స్టార్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఆర్సీ15 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ ప్లాన్‌లో ఉన్నాడు నిర్మాత దిల్ రాజు. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేస్తున్నాడు చరణ్.
మెగా పవర్ స్టార్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఆర్సీ15 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ ప్లాన్‌లో ఉన్నాడు నిర్మాత దిల్ రాజు. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేస్తున్నాడు చరణ్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే.. వాస్తవానికి ఆర్సీ 16 జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి చేయాల్సింది. కానీ ఫైనల్ వెర్షన్‌తో చరణ్‌ను మెప్పించలేకపోయాడు గౌతమ్. దాంతో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. ఇక చరణ్, బుచ్చిబాబుతో సినిమా అనౌన్స్ చేశాడు. అయితే ఆర్సీ 17 ఎవరితో చేయబోతున్నాడనేది క్లారిటీ రావడం లేదు. కానీ ఈ ప్రాజెక్ట్‌ను కన్నడ డైరెక్టర్ నర్తన్‌తో చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఇటీవల నర్తన్కు చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడనే న్యూస్ వైరల్‌గా మారింది. కానీ ఇప్పుడు మళ్లీ కథ మారిందంటున్నారు. తాజాగా బౌండెట్ స్క్రిప్ట్‌తో చరణ్‌ను మెప్పించలేకపోయాడట నర్తన్. దాంతో ఈయనను కూడా చరణ్ పక్కకు పెట్టేసినట్టేనని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడే దీనిపై ఓ అంచనాకు రావడం కష్టమే. కానీ ఆర్సీ 17 ఎవరితో ఉంటుందనేది.. మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చరణ్‌తో సుకుమార్, ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ లైన్లో ఉన్నారు. కాబట్టి చరణ్ నెక్స్ట్ డైరెక్టర్ ఎవరనేది ఇప్పుడే చెప్పలేం. మరి ఆర్సీ 17 ఎవరితో ఉంటుందో చూడాలి.