Ram Charan Daughter:బిడ్డను చూడడానికి కండీషన్లు పెట్టిన ఉపాసన.. చాలా ఓవర్ అంటున్న జనం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పెళ్లయిన దాదాపు 11ఏళ్లకు వారు తల్లిదండ్రులు అయ్యారు. జూన్ 20వ తారీఖున ఉపాసన హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
Ram Charan Daughter:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పెళ్లయిన దాదాపు 11ఏళ్లకు వారు తల్లిదండ్రులు అయ్యారు. జూన్ 20వ తారీఖున ఉపాసన హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అదే నెల జూన్ 30న మెగా ప్రిన్సెస్ ఊయల వేడుక, నామకరణం మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారని సమాచారం.
అతిథుల సమక్షంలో పాపకు `క్లిన్ కారా` అనే పేరు పెట్టారు. పాప పేరు డిఫరెంట్ గా ఉన్నా ట్రెండీ గా ఉందంటూ మెగా ఫ్యాన్స్ మురిసిపోయారు. అంతటి ఆగకుండా.. క్లిన్ కారా పేరిట ఫ్యాన్ పేజీలను కూడా ఓపెన్ చేశారు. ఈ సంగతి పక్కన పడితే.. రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ బిడ్డను ఎవరికీ చూపించలేదు. అయితే క్లిన్ కారాను చూసేందుకు స్టార్ సెలబ్రెటీలు, బంధువులు, సన్నిహితులు ఇంటికి వెళ్తుండగా.. తన బిడ్డను చూడాలంటే ఉపాసన కండీషన్స్ పెడుతుందట.
తమ బిడ్డను చూడాలంటే కొన్నికండీషన్స్ తప్పకుండా పాటించాల్సిందే అని మెఖం మీదే చెప్పేస్తోందట. అవేంటంటే.. ఇప్పుడే పుట్టిన నవజాత శిశువు కాబట్టి.. క్లిన్ కారా వద్దకు ఎవ్వరినీ ఫోన్స్ తీసుకెళ్లవద్దని చెబుతుందట. వ్యాధుల కాలం కాబట్టి ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఉండేందుకు పాపను ఓ స్పెషల్ రూమ్ లో ఉంచుతుందట. తన పాపాను చూసేందుకు వచ్చిన వారిని టచ్ చేయవద్దని చెబుతుందని నెట్టింట్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా మంది ఉపాసన తీరును తప్పబడుతున్నారు. ఇది మరీ టూ మచ్.. ఓవర్ చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం తన బిడ్డ ఆరోగ్యం పట్ల ఇలాంటి కేర్ తీసుకోవడం కామన్ అంటున్నారు.