»Ap Weather Update Heavy Rain To Fall In Some Districts On 18th March Meteorological Department Gives Warning
Ap Rain Alert: ఏపీలోని ఆ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rain) ముంచెత్తుతున్నాయి. గురువారం నుంచి అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఏపీలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. శనివారం కూడా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

శుక్రవారం ఏపీ(Ap)లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు(Huge Rain) కురిశాయి. తెలంగాణలో అయితే వడగండ్ల వర్షం కురిసింది. ఇకపోతే ఏపీలో శనివారం రోజు పలు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. రేపు ఏపీలోని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
ఇకపోతే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు(Warning) జారీ చేసింది. రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం(Rain) పడుతుందని, పొలాల్లో చెట్ల కింద ప్రజలు ఉండొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.