»Starc Gets 5 Wickets As Team India Bundled Out For 117 In Visakhapatnam
IND vs AUS: 117 పరుగులకు టీమిండియా ఆలౌట్
ఆస్ట్రేలియా(Australia), టీమిండియా(Team India) మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా గెలుపొందింది. నేడు రెండు వన్డే మ్యాచ్ విశాఖలో జరుగుతోంది. ఏసీఏ-వీడీసీఏ గ్రౌండ్ భారత్ బాగా కలిసొచ్చిన మైదానం. అయితే నేడు జరుగుతోన్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలర్ల జోరుకు భారత్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. 117 పరుగులకే టీమిండియా(Team India) ఆలౌట్ అయ్యింది. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ 5 వికెట్లను పడగొట్టాడు.

స్టార్క్ నిప్పులు చెరిగే బౌలింగ్ కు భారత టాపార్డర్(Top Order) విఫలం అయ్యింది. ఆసీస్ బౌలర్లు అయిన షాన్ అబ్బాట్ 3 వికెట్లు, నాథన్ ఎల్లిస్ 2 వికెట్లను పడగొట్టారు. 26 ఓవర్లలోనే టీమిండియా(Team India) 117 పరుగులకు ఆలౌట్(All Out) అవ్వడంతో భారత అభిమానులు షాకయ్యారు. వన్డేల్లో టీమిండియాకు ఇది మూడో అత్యల్ప స్కోరుగా నిలిచింది.
చివర్లో అక్షర్ పటేల్ కాస్త నిలకడగా ఆడటంతో టీమిండియా(Team India) స్కోరు కాస్త ముందుకు జరిగింది. అక్షర పటేట్ 29 బంతుల్లో 29 పరుగులు చేశాడు. 2 వరుస సిక్సర్లతో ప్రేక్షకులను అలరించాడు. జడేజా 16 పరుగులు చేయగా టీమిండియా(Team India)లో అత్యధికంగా కోహ్లీ(Kohli) 31 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 13, కేఎల్ రాహుల్ 9, పాండ్యా 1 పరుగు చేశారు.