»Marsh And Head Fifties Guide Australia 10 Wicket Win In Second Odi
IND vs AUS: టీమిండియా ఘోర పరాజయం
ఆస్ట్రేలియా(Australia)తో నేడు జరిగిన వన్డే మ్యాచ్ లో టీమిండియా(Team India) ఘోర పరాజయాన్ని పొందింది. మొదటి వన్డే మ్యాచ్ ఘన విజయం సాధించిన భారత్ రెండో వన్డేలో చతికిలపడింది. మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా 26 ఓవర్లలోనే 117 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 11 ఓవర్లలోనే టార్గెట్ ను ఛేదించింది. టీమిండియా(Team India) బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. ఆస్ట్రేలియా బౌలర్ అయిన మిచెల్ స్టార్క్ 5 వికెట్లు తీశాడు. అతడి బౌలింగ్ కు భారత బ్యాటర్లు తడబడ్డారు. విశాఖలోని ఏసీఏ వీడీసీఏ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ మూడో అత్యల్ప స్కోరు చేసింది.
ఆస్ట్రేలియా(Australia) ఓపెనర్ మిచెల్ మార్ష్ విశాఖ పిచ్ పై చెలరేగిపోయాడు. భారత బ్యాట్స్ మెన్లు బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడిన ఆ మైదానంలోనే బౌండరీల వర్షాన్ని ఆసీస్ ఆటగాడు మిచెల్ మార్ష్ కురిపించాడు. మార్ష్ మొత్తం 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులతో 66 రన్స్ చేశాడు. మరో ఓపెనర్ అయిన ట్రావిస్ హెడ్ కూడా అర్ధ సెంచరీ చేశాడు. 30 బంతుల్లో 10 ఫోర్లు కొట్టి 51 పరుగులు చేశాడు. రెండో వన్డే మ్యాచ్ లో ఆసీస్ విజయం(Victory)తో ఈ సిరీస్ 1-1గా నిలిచింది. మూడో వన్డే మ్యాచ్ మార్చి 22న చెన్నైలో జరగనుంది.