»Rain Alert Heavy Rain Lashes Ap And Telangana Creates Havoc Weather Department Predicts
Rain Alert: మరో 24 గంటల్లో భారీ వర్షాలు..తెలుగు రాష్ట్రాలకు అలర్ట్
తెలుగు రాష్ట్రాలకు వర్షం(Rain) ముప్పు పొంచి ఉంది. కర్ణాటక నుంచి జార్ఖండ్ వరకూ ద్రోణి ఏర్పడి ఉందని, అది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మరో 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఏపీ(AP), తెలంగాణ(Telangana)లో ఉన్నట్టుండి క్యుములోనింబస్ మేఘాలు విరుచుకుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఏపీ, తెలంగాణలో పెనుగాలులు, వడగళ్ల వానతో పాటు పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్(Weather Department) తెలిపింది. రాళ్ల వర్షంపై రెండు తెలుగు రాష్ట్రాలు ప్రజలను అప్రమత్తం చేశాయి. వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అలర్ట్(Alert) జారీ చేశారు. ఇకపోతే వడగళ్లవాన రైతులకు కడగండ్లను మిగిల్చింది. రాళ్ల వానకు పెద్ద ఎత్తున పంటలు దెబ్బ తిన్నాయి. వేలాది ఎకరాల్లో మిర్చి, అరటి, వరి, మామిడి, మొక్కజొన్న పంటలు నేటమట్టమవ్వడంతో రైతులు(Formers) ఆందోళన చెందుతున్నారు.
చేతికొచ్చిన పంట కళ్లెదుటే మట్టిపాలు కావడంతో రైతులు(Formers) గుండెలు బాదుకుంటూ కన్నీళ్లు కార్చుతున్నారు. తెలంగాణ(Telangana)లో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో భారీగా పంటల నష్టం జరిగింది. అలాగే ఏపీ(AP)లో ఉమ్మడి అనంతపురం, విజయనగరం, కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో భారీగా పంటలు నష్టపోయాయి. మరో మూడు రోజులు పాటు వర్షాలు(Rain) ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.