»Rain In Visakhapatnam Before 2nd Odi India Vs Australia Fans Are Tension
Visakhapatnam: వన్డేకు ముందు విశాఖపట్నంలో వర్షం..ఆవేదనతో ఫ్యాన్స్!
ఏపీలోని విశాఖ(Visakhapatnam)లో భారత్-ఆస్ట్రేలియా(india vs australia) మధ్య జరగనున్న రెండో వన్డే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖపట్నంలో చిరుజల్లులు(rain) కురుస్తున్న క్రమంలో మధ్యాహ్నం 1.30 నిమిషాలకు మ్యాచ్ జరుగుతుందా లేదా అని ఫ్యాన్స్ తో(Fans are tension) పాటు అధికారులు కూడా వేచిచూస్తున్నారు.
నేడు విశాఖ(Visakhapatnam)లో జరగాల్సిన భారత్, ఆస్ట్రేలియా(india vs australia) జట్ల మధ్య రెండో వన్డే(2nd ODI) మ్యాచుకు వరణుడు(rain) అడ్డంకిగా మారాడు. విశాఖపట్నంలో గత రెండు రోజులుగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ జరగడంపై సందిగ్ధం నెలకొంది. దీంతో అధికారులతోపాటు అభిమానులు కూడా టెన్షన్(Fans are tension) పడుతున్నారు. మూడేళ్ల తర్వాత ఈ నగరం వన్డే మ్యాచుకు ఆతిథ్యమిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది క్రీడాభిమానులు టిక్కెట్లు సైతం కొనుగోలు చేశారు. అయితే మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు జరగనుంది. అప్పటివరకు వర్షం తగ్గి వాతావరణం తేలిపోతే మ్యాచ్ నిర్వహించనున్నారు.
మ్యాచ్‌కు వర్షం ముప్పును ప్రస్తావిస్తూ గ్రౌండ్లో అద్భుతమైన డ్రైనేజీ వ్యవస్థ ఉందని మాజీ టెస్ట్ అంపైర్, వీడీసీఏ సెక్రటరీ పార్థసారథి అన్నారు. వర్షం ఆగిన గంటలోపు మ్యాచ్‌ను తిరిగి ప్రారంభించవచ్చని పార్థసారథి అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం స్టేడియం గ్రౌండ్ మొత్తం కవర్లతో కప్పివేసినట్లు తెలిపారు. నీటిని హరించడానికి సూపర్ సోపర్లు కూడా ఉన్నాయని చెప్పారు. చాలా మంది ఆటగాళ్లకు వైజాగ్ ఎప్పుడూ స్పెషల్ అని అన్నారు. ఇక్కడ గతంలో ఇండియా(team india) ఆడిన అనేక మ్యాచులు గెలిచినట్లు తెలిపారు.
ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం టీమిండియా క్రీడాకారులు శనివారం సాయంత్రం విషాఖ ఎయిర్ పోర్టుకు(airport)రాగా..వారికి అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక ఏర్పాట్లతో రాడిసన్ బ్లూ హోటల్ కు వారిని తీసుకెళ్లారు. మరోవైపు మొదటి వన్డే ముంబయిలో జరుగగా..ఇండియా జట్టు ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. రాహుల్ 75, జడేజా 45 రన్స్(runs) చేసి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు.