»India Vs Australia 2nd Odi 2023 Match Started In Visakhapatnam With Just One Wicket
india vs australia:విశాఖలో మ్యాచ్ షురూ..అప్పుడే 3 వికెట్లు
ఈరోజు విశాఖ(Visakhapatnam)లో భారత్, ఆస్ట్రేలియా(india vs australia) జట్ల మధ్య రెండో వన్డే(2nd ODI) మ్యాచ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. వర్షం తగ్గడంతో వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది వేగవంతంగా చర్యలు తీసుకుని ఆటను ఆరంభించేలా చేశారు. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఈరోజు విశాఖ(Visakhapatnam)లో భారత్, ఆస్ట్రేలియా(india vs australia) జట్ల మధ్య రెండో వన్డే(2nd ODI) మ్యాచ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. వర్షం తగ్గడంతో వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది వేగవంతంగా చర్యలు తీసుకుని ఆటను ఆరంభించేలా చేశారు. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా ఆటకోసం బరిలోకి దిగింది. అయితే ఇండియా జట్టులో శార్దూల్ ఠాకూర్ స్థానంలో అక్షర్ పటేల్ వచ్చాడు.
ఈ క్రమంలో ముందుగా ఆటకు వచ్చిన రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్ ఓపెనర్లలో.. గిల్ మొదటి ఓవర్లో మూడో బంతికే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ 13 రన్స్ చేసి ఔట్ కాగా, తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్ కూడా ఎల్బీ డబ్య్లూతో ఔట్ అయ్యి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇండియా మూడు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
మరోవైపు మొదటి వన్డే ముంబయిలో జరుగగా..ఇండియా జట్టు ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. రాహుల్ 75, జడేజా 45 రన్స్(runs) చేసి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. మరి ఈ మ్యాచులో ఎవరు మంచిగా ఆడి టీమ్ ఇండియా విజయానికి తోడ్పాటునిస్తారో చూడాలి.