»No Matter How Much The College Fees Are I Am Responsible Ap Cm Jagan At Tiruvuru Ntr District
Jagan: కాలేజీ ఫీజుల బాధ్యత నాదే..పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు ఒక్కటే
ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా(ntr district) తిరువూరు(tiruvuru)లో నిర్వహించిన జగనన్న విద్యా దీవెన(Jagananna Vidya Deevena), వసతి దీవెన(jagananna vasathi deevena) నిధుల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలకు ఇస్తున్న ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువు మాత్రమేని అన్నారు. మరోవైపు ప్రతి కుటుంబంలో ఎంత మంది ఉన్నా కూడా వారి పిల్లల చదువు బాధ్యత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
మన పిల్లలకు ఏదైనా ఆస్తి ఇస్తున్నామంటే అది ఒక్క చదువు మాత్రమేనని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm Jagan) అన్నారు. ఒక మనిషి పేదరికం నుంచి బయటపడాలంటే అది ఒక్క చదువు(education)తో మాత్రమే ప్రధానంగా సాధ్యమని పేర్కొన్నారు. అలాంటి చదవులకు పేదరికం అడ్డు రాకూడదని, పేదరికం వల్ల చదువులు మానేయకూడదని తెలిపారు. ఈ క్రమంలో మీ పిల్లల చదువు బాధ్యత తనదని, కాలేజీలలో ఫీజులు ఎంతైనా భరిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. జగనన్న విద్యా దీవెన(Jagananna Vidya Deevena), వసతి దీవెన(jagananna vasathi deevena) కార్యక్రమాల ద్వారా 9 లక్షల 86 వేల మందికిపైగా పిల్లలకు లబ్ది చేకూరుతుందని సీఎం చెప్పారు. ఈ నేపథ్యంలో 8 లక్షల కుటుంబాల్లోని తల్లుల ఖాతాలకు నేరుగా నగదు వెళుతుందని తెలిపారు. ఈ క్రమంలో దాదాపు 700 కోట్ల రూపాయలు ఆయా ఖాతాలకు ట్రాన్స్ ఫర్ కానున్నట్లు వెల్లడించారు.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా(ntr district) తిరువూరు(tiruvuru)లో నిర్వహించిన జగనన్న విద్యా దీవెన(Jagananna Vidya Deevena), వసతి దీవెన(jagananna vasathi deevena) నిధుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్(jagan) ప్రసంగించారు. మరోవైపు ఫ్యామిలీలో ఎంత మంది ఉంటే అంత మందికి ఈ పథకాలు విర్తిస్తాయని జగన్ స్పష్టం చేశారు. ఇప్పటికే 2017 నుంచి బకాయిలతోపాటు రూ.13,311 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యార్థుల ఉన్నత విద్య కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమాల ద్వారా ప్రతి పేద కుటుంబం(family) నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటె భవిష్యత్తులో మరింత బాగుండాలని ఈ స్కీమ్స్ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. అజ్ఞానాన్ని చీకటీతో, విజ్ఞానాన్ని వెలుగుతో విద్య ద్వారా నింపవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. వెనుకబడిన కులాల తలరాతలు మార్చగలిగే శక్తి కేవలం విద్యకు మాత్రమే ఉందన్నారు. మరోవైపు రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు సైతం నిర్మాణంలో ఉన్నాయని గుర్తు చేశారు. ఏదైనా కాలేజీలలో(colleges) సమస్యలు ఉంటే 1092కు ఫోన్ చేయాలని విద్యార్థులకు(students) సూచించారు. దేశంలో ఇలాంటి పథకాలు ఎక్కడా లేవని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.