SRPT: హుజూర్నగర్ మండలానికి నూతన ఎంపీడీవోగా గ్రూప్-1 అధికారి దేవిరెడ్డి సుమంత్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో సిబ్బందితో సమావేశమై పరిపాలన అంశాలను సమీక్షించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు సమర్థవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.