తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని కేసీఆర్ చేసిన కామెంట్లపై రేవంత్ రెడ్డి స్పందించారు. పచ్చి అబద్దాన్ని కూడా నిజం అనిపించేలా చెప్పడంలో మిమ్మల్ని మించిన వారు ఎవరూ లేరన్నారు.
ఓ వృద్ధుడికి ఇద్దరు పోలీసులు(police) సహాయం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన పప్పును పోలీసులు ఓపికతో సేకరించి సంచిలోకి ఎత్తారు. ఇది చూసిన నెటిజన్లు వారు చేసిన పనికి అభినందనలు తెలియజేస్తున్నారు.
బీహార్(Bihar)లోని నలంద, షరీఫ్‌లోని రెండు మూడు చోట్ల శనివారం రాత్రి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మరోవైపు ఈ ఘటనలో మతపరమైన కోణం లేదని బీహార్ పోలీసులు చెప్పారు.
మరికొన్ని గంటల్లో ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీ కొనబోతుంది. అభిమానుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుండగా.. మెట్రో కూడా అదనపు సర్వీసులు వేసింది.
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వివాదంలో చిక్కుకున్నారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు వద్ద ఉన్న ఏపీ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. మీకు ఇక్కడేం పని ప్రశ్నించారు.
హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో రేపు సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే అన్ని రకాలు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు దాదాపు 1500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతేకాదు స్టేడియంలోనికి కొన్ని వస్తువులు తీసుకెళ్లడం నిషేధమని ప్రకటించారు.
మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై ఆరెస్సెస్(RSS) కార్యకర్త కమల్ బదౌరియా హరిద్వార్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఏప్రిల్ 12న ఈ కుసు విచారణకు రానుంది. ఆర్‌ఎస్‌ఎస్ సభ్యలు 21వ శతాబ్దపు కౌరవులని రాహుల్ గాంధీ హర్యానాలో వ్యాఖ్యలు చేశారు.
ముంబైలో జరిగిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనంత్ అంబానీ(Anant Ambani), అతనికి కాబోయే భార్య రాధికా మర్చంట్(Radhika Merchant) కలిసి పాల్గొన్నారు. ముకేష్ అంబానీ కుమారుడు బ్లాక్ కలర్ సూట్ ధరించగా, రాధిక అద్భుతమైన నలుపు చీరను ధరించి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇది చూసిన పలువురు నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
దేశంలోని చాలా ప్రాంతాలలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) శనివారం వెల్లడించింది. మధ్య, తూర్పు, వాయువ్య భారతంలోని అనేక ప్రాంతాల్లో ఈ హీట్‌వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.
ఇటలీ యొక్క డేటా ప్రొటెక్షన్ అథారిటీ నుంచి ChatGPT తమ వినియోగదారుల డేటాను దొంగిలించిందని ఆరోపించింది. అంతేకాకుండా మైనర్‌లు అక్రమ విషయాలకు గురికాకుండా నిరోధించడానికి చాట్‌జిపిటికి వయస్సు నిర్ధారణ వ్యవస్థ లేదని చెప్పింది. దీంతో గోప్యతా సమస్యలపై ChatGPTని నిషేధించిన మొదటి దేశంగా ఇటలీ అవతరించింది.
ఇండియాలో శనివారం కొత్తగా 2,994 కరోనా వైరస్ కేసులు(covid cases) రికార్డయ్యాయి. శుక్రవారం నాటి 3095 కరోనా వైరస్ కేసులతో పోల్చుకుంటే కొంచెం తగ్గుదల కనిపించింది. మరోవైపు గత 24 గంటల్లో తొమ్మిది మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 2.09 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ 2.03 శాతంగా నమోదైంది.
TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు TSPSC కార్యదర్శి సెక్రటరీ అనితా రామచంద్రన్(Anita Ramachandran)కి ఏప్రిల్ 1న హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఆమె నేడు సిట్ ఎదుట హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సెక్రటరీ నుంచి అధికారులు వాంగ్మూలాన్ని స్వీకరిస్తున్నారు.
ప్రగతి భవన్ మార్చ్‌కు వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు ఈ రోజు పార్టీ అధినేతలకు ఫోన్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్ చేశారు.